శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
శేషాచలం అటవీ ప్రాంతంలో అరుదైన పచ్చ నాగు, తిరుపతి కళాశాలలో భారీ జెర్రిపోతు కలకలం రేపాయి. స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు వీటిని సురక్షితంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు. అడవుల నుండి జనావాసాల్లోకి పాములు వస్తున్నందున భక్తులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఘటనలు శేషాచలం జీవవైవిధ్యాన్ని చాటుతున్నాయి.
జీవవైవిధ్యానికి నిలయమైన శేషాచలం అటవీ ప్రాంతంలో మరో అరుదైన జీవి దర్శనమిచ్చింది. సాధారణంగా నాగు పాములు బూడిదరంగులో లేదంటే నలుపు రంగులో ఉంటాయి. కానీ తిరుమల అటవీ ప్రాంతంలో ఓ అరుదైన పచ్చ రంగు నాగుపాము కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తిరుమల కొండపై సుమారు రెండు అడుగుల పొడవున్న పచ్చ రంగు నాగుపాము పడగ విప్పి సంచరిస్తుండటాన్ని గమనించిన స్థానికులు టీటీడీ ఫారెస్ట్ విభాగానికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఆ పామును సురక్షితంగా పట్టుకున్నారు. సాధారణ నాగుపాముల్లాగే ఇది కూడా అత్యంత విషపూరితమైనదని, ఇలాంటి అరుదైన రంగులో ఉండటం శేషాచలం అడవుల ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆ పామును దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. మరోవైపు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ఆవరణలో ఆరడుగుల పొడవైన భారీ జెర్రిపోతు కనిపించడంతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న భాస్కర్ నాయుడు వెంటనే అక్కడికి చేరుకుని, స్టిక్ సహాయంతో ఆ పామును చాకచక్యంగా పట్టుకుని బ్యాగులో బంధించారు. దానిని కూడా సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడంతో కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. అడవుల నుండి జనావాసాల్లోకి పాములు వస్తున్న తరుణంలో భక్తులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
10th Class Exams: ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత
పట్టుచీరలపై కన్నేసిన కిలేడీలు.. ఏం చేశారో మీరే చూడండి
