మాత్ర వేస్తేనే మూత్రం ఆగేది..! ఇదో అరుదైన వ్యాధి..! అతిమూత్రం వ్యాధితో బాధపడుతున్న దీపక్..(వీడియో)
ఒక మనిషి రోజులో 8కంటే ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్తే అతి మూత్రం సమస్య ఉన్నట్లే అంటారు వైద్యులు. డాక్టర్లు చెప్పిన్నట్లుగా నిజామాబాద్ జిల్లాలో 15 ఏళ్ల నిరుపేద బాలుడు అరుదైన అతిమూత్రం వ్యాధితో అవస్థ పడుతున్నాడు.
ఒక మనిషి రోజులో 8కంటే ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్తే అతి మూత్రం సమస్య ఉన్నట్లే అంటారు వైద్యులు. డాక్టర్లు చెప్పిన్నట్లుగా నిజామాబాద్ జిల్లాలో 15 ఏళ్ల నిరుపేద బాలుడు అరుదైన అతిమూత్రం వ్యాధితో అవస్థ పడుతున్నాడు. తల్లిదండ్రులు లేకపోవటంతో కాటికి కాలు చాచిన నానమ్మకు ఈ బాలుడికి వైద్యం, పోషణ తలకు మించిన భారంగా మారింది. నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన గుండేటి దీపక్ ఓ వింత వ్యాధితో అవస్థ పడుతున్నాడు..లక్షలో ముగ్గురికి మాత్రమే సోకే ఈ అరుదైన జబ్బుతో ఆ బాలుడు నరకయాతన అనుభవిస్తున్నాడు..చికిత్స చేయించుకోలేక నిస్సహాయ స్థితిలో చేయూత కోసం ధీనంగా చూస్తున్నాడు. పెద్దవాళ్లు.. బిపి టాబ్లెట్లు వేసుకున్నట్టుగా చిన్న వయసులోనే ఈ బాలుడు ప్రతిరోజూ మూత్రం ఆపుకోవటానికి మాత్ర వేసుకుంటున్నాడు..
2019లో దీపక్ తండ్రి గుండెపోటుతో మృతిచెందాడు. కొంతకాలానికి అనారోగ్యంతో తల్లి కూడా చనిపోయింది. దీంతో దీపక్, అతని చెల్లెలు శ్రావ్య అనాథలయ్యారు. తలకొరివి పెట్టాల్సిన కొడుకు, కోడలు కాలం చేయటంతో..ముసలి వయసులో ఇద్దరు పిల్లల బాధ్యత ఈ వృద్ధురాలిపై పడింది. అయితే, చిన్ననాటి నుంచి దీపక్ ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో భాదపడేవాడని, ఐదేళ్ల వయసులో డెంగీ వ్యాధి సోకితే హైదరాబాద్‌లో చికిత్స చేయించారు. ఆ తర్వాత..కొంతకాలం బాగానే ఉన్నాడు. కానీ, ఇటీవల దీపక్ ముక్కులోంచి రక్తం కారడం మొదలైంది..ఆస్పత్రిలో చూపించే శక్తి వీళ్ల నానమ్మకు లేకపోవటంతో..పిల్లలు చదివే స్కూల్లోని టీచర్ ఒకరు సొంత ఖర్చులతో డాక్టర్లు చూపించారు. అన్ని వైద్య పరీక్షలు చేయించగా బాలుడికి,….సెంట్రల్ డయాబెటిక్ ఇన్సిపిడస్ అనే అరుదై వ్యాధి ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. మూత్రపిండాలను నియంత్రించే హార్మోన్ను విడుదల చేసే పిట్యూటరీ గ్రంథి దెబ్బతినడంతో సేవించిన నీరు శరీరానికి ఇంకకుండా నేరుగా మూత్రపిండాల ద్వారా బయటకు వెళుతుంది. తరచు దాహం కావడం, తిన్నది కూడా ఒంటికి పట్టకపోవడం జరుగుతుంది. మూత్రపిండాలను పనిచేయించాలంటే కృత్రిమంగా హార్మోను మాత్రలు వాడాలని వైద్యులు సిఫారసు చేశారు. ఈ లోపాలతో బాలుడిలో ఎదుగుదల కూడా నిలిచిపోయింది. మాత్ర వేయకుంటే తరచూ మూత్రం…రోజుకు రెండు పూటలు మాత్రలు వేయాల్సిందే. లేదంటే తరచూ మూత్రానికి వెళ్లాల్సిందే. తరచూ దాహం, మూత్రంతో శరీరం బలహీనపడడం, రాత్రి వేళ ఈ అతిమూత్రంతో సరైన నిద్ర లేక ఇబ్బంది పడుతూ… దీపక్ నరకయాతన అనుభవిస్తున్నాడు.
కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఈ మాత్రాలే ఇప్పుడు గుదిబండగా మారాయి. మూడేళ్ళ పాటు దుకాణంలో పని చేసి.. వచ్చిన జీతంతో తల్లి మాత్రలు తీసుకొచ్చింది. నానమ్మ, అమ్మ సంపాదనతో సర్దుకుపోయినా… ఇప్పుడు తల్లి చనిపోవడంతో వృద్ధురాలిపైనే భారమంతా పడుతోంది. ఆమెకొచ్చే అరకొర ఆదాయం కుటుంబ పోషణకే సరిపోవడంలేదు. ఇక మాత్రలెక్కడి నుంచి తెచ్చి మనవన్ని కాపాడుకోవాలని కన్నీరుమున్నీరవుతోంది వృద్ధురాలు అబ్బవ్వ.. ఎవరైనా దాతలు దయతలచి సాయం చేయాలని వేడుకుంటోంది.