తలుపు తీసి ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి.. గదిలో సీన్‌ చూసి షాక్‌

Updated on: Nov 06, 2025 | 1:33 PM

ఒక్కోసారి ఇంట్లో ఊహించని ఘటనలు ఎదురవుతాయి. నిత్యం మనుషులు తిరుగుతూ సందడిగా ఉండే ఇంట్లోకి ఎక్కడో అడవుల్లో ఉండాల్సిన కొండచిలువలు, పాములు కనిపిస్తే.. ఒక్కసారి ఊహించుకోండి. భయంతో వణుకుపుడుతుంది కదూ. అలాంటి ఘటనే జరిగింది హైదరాబాద్‌ రంగారెడ్డి జిల్లాలో. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్ద గ్రామ సమీపంలో ఉన్న వెంచర్లో గత కొంతకాలంగా సముద్రాల అంజయ్య, గొర్రెలను కాస్తు జీవనం సాగిస్తున్నాడు.

రోజు మాదిరిగానే శనివారం యధావిధిగా వెంచర్లోకి వెళ్లాడు. అక్కడ ఓ గదిలో వింత శబ్దాలు వినిపించాయి. ఏమై ఉంటుందా అని లోపలికి వెళ్లిన అతను అక్కడ ఓ పెద్ద కొండ చిలువ చుట్టలా చుట్టుకొని ఉండటం గమనించాడు. దెబ్బకు భయంతో బయటకు పరుగులు తీశాడు. గ్రామస్తులకు సమాచారం అందించడంతో వారు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. తక్షణం అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు రెండు గంటలపాటు శ్రమించి కొండచిలువను బంధించారు. అనంతరం ఓ వేసుకొని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లివదిలిపెట్టడంతో గ్రామస్థులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏ క్షణమైనా యుద్ధంలోకి అమెరికా

9 జిల్లాల్లో పిడుగులు.. ఐఎండీ హెచ్చరికలు