Telangana: తెలంగాణలో మరణాలకు అడ్డాగా మారిన జాతీయ రహదారి

Updated on: Mar 05, 2026 | 10:12 PM

తెలంగాణలోని రాజీవ్ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణం, సర్వీస్ రోడ్లు, హెచ్చరిక బోర్డుల లేమి వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రహదారిపై ప్రయాణం ప్రజలకు నిత్యం భయాందోళన కలిగిస్తోంది. అధికారులు తక్షణమే భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

రాజీవ్ రహదారి ప్రస్తుతం తెలంగాణలో అత్యంత ప్రమాదకరమైన రహదారుల్లో ఒకటిగా మారింది. ఈ మార్గంలో ప్రయాణించడం ప్రజలకు నిత్యం భయాందోళన కలిగిస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాలను కలుపుతూ, హైదరాబాద్‌కు ప్రధాన మార్గంగా ఉన్న ఈ రహదారిపై వారానికి కనీసం మూడు నుంచి నాలుగు ప్రమాదాలు జరుగుతున్నాయి. వందలాది మందిని ఈ రహదారి ఇప్పటికే బలిగొంది. ముఖ్యంగా, రోడ్డు నిర్మాణంలో నిబంధనలను పాటించకపోవడం, గ్రామాలు మరియు స్టేజీల వద్ద సర్వీస్ రోడ్లు లేకపోవడం, స్పీడ్ లిమిట్ గన్స్, సైనింగ్ బోర్డులు, హెచ్చరిక బోర్డులు లేకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 21 ప్రమాదకర ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

US-Israel-Iran War: ఇజ్రాయెల్, అమెరికా Vs ఇరాన్.. దాడులు చేసుకున్న ప్రదేశాలివే

Ayodhya: అయోధ్య దశదిశ మార్చేసిన రామమందిరం

US-Israel-Iran War: షియా Vs సున్నీ.. యుద్ధ రంగంలోకి సౌదీ అరేబియా

Nitish Kumar: సీఎం పదవికి త్వరలో నితీష్ రాజీనామా

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి ధర !

Follow Us