టెర్రస్ పై నుంచి దూకబోయిన ‘నీట్’ విద్యార్థిని.. చివరి నిమిషంలో

Updated on: Sep 02, 2025 | 1:34 PM

ఇష్టం లేని చదువులు చదవలేక.. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక.. చాలా మంది యువకులు, యువతులు ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఇటీవలి కాలంలో చాలా చూస్తున్నాం. ఇష్టం లేక కొందరు.. ఎంత చదివినా అది బుర్రకెక్కక మరికొందరు.. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే నీట్ పరీక్షల ఒత్తిడి, మార్కుల టెన్షన్ ను తట్టుకోలేకనో.. నీట్‌లో సీటు రాదనే భయంతోనే పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

నీట్ కోచింగ్‌కు దేశవ్యాప్తంగా రాజస్థాన్ బాగా ఫేమస్. రాజస్థాన్‌లోని కోటాలో నీట్ విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్న వార్తలు మనం ఎన్నో చూశాం. తాజాగా రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. నీట్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఒక విద్యార్థిని..తాజాగా ఆత్మహత్యాయత్నం చేసింది. యువతి బిల్డింగ్‌ పైకి ఎక్కి దూకేందుకు ప్రయత్నించగా.. అక్కడ ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో తెగ వైరల్ అవుతోంది. ఆ విద్యార్థిని.. కోచింగ్ సెంటర్ బిల్డింగ్ అంచున కూర్చోవడం వీడియోలో కనిపించింది. అది గమనించిన కోచింగ్ సెంటర్ సిబ్బంది, స్థానికులు.. ఆ యువతిని రక్షించడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి. యువతి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడంతో.. ఆ రోడ్డుపై భారీగా జనం గుమిగూడారు. చివరికి ఒకరు దగ్గరికి వెళ్లి ఆమెను అతి కష్టం మీద కిందికి తీసుకువచ్చారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. ఆత్మహత్యకు యత్నించిన ఆ విద్యార్థిని.. గత కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతోందని తెలిపారు. నీట్ కోచింగ్‌లో భాగంగా నిర్వహించే పరీక్షలు రాయడం ఆ యువతి మానేసిందని.. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే తిడతారని భయపడి.. ప్రాణాలు తీసుకోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rainfall Warning: మరో అల్పపీడనం.. వచ్చే 3 రోజులు వానలే వానలు

గుళ్లలో హుండీలను 10 సార్లు చోరీ చేసిన హెచ్‌ఐవీ పాజిటివ్‌ వ్యక్తి .. దేవుడిపై కోపంతోనే !

అదే జరిగితే.. అమెరికా కొంప మునిగినట్లే

Vishal: పెళ్లికి ముందే సంచలన నిర్ణయం తీసుకున్న హీరో విశాల్‌

Krish Jagarlamudi: ఎట్టకేలకు అసలు విషయం చెప్పిన క్రిష్‌