రైతు పొలంలో బంగారు వస్తువులు.. దగ్గరకు వెళ్లి చూసి భయంతో పరుగో పరుగు
రోజూ మాదిరిగానే ఓ రైతు ఆరోజుకూడా ఉదయాన్నే తన పొలం పనులకు వెళ్లాడు. ఈ క్రమంలో పొలానికి నీళ్లు పెట్టేందుకు బావి దగ్గరకు వెళ్లగా అక్కడ అతనికి బంగారు వస్తువులు కనిపించాయి.
రోజూ మాదిరిగానే ఓ రైతు ఆరోజుకూడా ఉదయాన్నే తన పొలం పనులకు వెళ్లాడు. ఈ క్రమంలో పొలానికి నీళ్లు పెట్టేందుకు బావి దగ్గరకు వెళ్లగా అక్కడ అతనికి బంగారు వస్తువులు కనిపించాయి. అవి చూడగానే అనుమానం వచ్చి, బావిలోకి తొంగి చూసాడు. అంతే దెబ్బకు ఉలిక్కిపడి అక్కడినుంచి పరుగులంకించుకున్నాడు. అసలేం జరిగిందంటే..రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లా షేర్గర్ గ్రామానికి చెందిన రైతు తన పొలంలోని బావిలో మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాడు. రైతు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిద్దరూ ప్రేమికులుగా ప్రాధమిక అంచనాకు వచ్చారు పోలీసులు. మృతుల్లో యువతి అదే గ్రామానికి చెందిన అమ్మాయి కాగా, యువకుడు బేవార్‌కు చెందినవాడుగా గుర్తించారు. ఇద్దరు చేతులకు చున్నీ కట్టి ఉండటం.. బావి గట్టుపై బ్రాస్‌లెట్లు, ఆ పక్కనే ఉన్న చెప్పుల జతలు బట్టి.. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆ మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
JR NTR: బ్రాండ్ అంటే.. ఇది సర్ !! ఒరిజినల్ అంతే..
జక్కన్న పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఏఆర్ రెహమాన్.. ఏంటంటే ??
Kantara: ఆ ఒక్క సీనే.. థియేటర్ దద్దరిల్లేలా చేస్తోంది..
Kajal Aggarwal: కాజల్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. నీల్‌ని ఉద్దేశిస్తూ
రెస్టారెంట్ కి వెళ్లిన జో బైడెన్ కు.. షాకిచ్చిన క్యాషియర్
డబ్బులు ఇచ్చే ఏటీఎం కాదు… ఇడ్లీలు ఇచ్చే ఏటీఎం.. చట్నీ, కారప్పొడితో
