కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు

Updated on: Jan 22, 2026 | 9:30 AM

రాజస్థాన్‌కు చెందిన శివ్ జోహ్రీ, తన కుమార్తె వివాహం కోసం 3 కిలోల వెండితో, రూ.25 లక్షల అద్భుత వెడ్డింగ్ కార్డును తయారు చేయించారు. ఏడాది శ్రమతో, 65 మంది దేవతామూర్తుల విగ్రహాలతో రూపొందిన ఈ ప్రత్యేక ఆహ్వాన పత్రికను ఆయన స్వయంగా డిజైన్ చేశారు. దేవతలను సైతం ఆహ్వానించి, భవిష్యత్ తరాలకు జ్ఞాపికగా నిలిచే అపురూప కళాఖండమిది.

రాజస్థాన్‌కు చెందిన ఒక తండ్రి తన కూతురి పెళ్లిని గ్రాండ్‌గా చేయాలని నిర్ణయించి అందుకోసం వెండితో వెడ్డింగ్‌ కార్డును కంసాలులకు చెప్పి తయారు చేయించారు. జైపూర్‌కు చెందిన శివ్ జోహ్రీ అనే వ్యక్తి తన కుమార్తె శృతి వివాహం కోసం 3 కిలోల వెండితో రూ.25 లక్షల ఖర్చుతో ఒక అద్భుత వెండి కార్డును తయారు చేయించారు. 65 మంది దేవతామూర్తుల విగ్రహాలున్న ఆ వెడ్డింగ్ కార్డు తయారీకి ఏడాది సమయం పట్టింది. తన కుమార్తె పెళ్లి ఆహ్వాన పత్రికను స్వయంగా తనే డిజైన్‌ చేసారు శివ్ జోహ్రీ . కేవలం బంధుమిత్రులనే కాకుండా.. సకల దేవతలను తన కూతురి పెళ్లికి ఆహ్వానించాలనే ఉద్దేశంతో ఇలా 65 మంది దేవతా మూర్తులతో ఆ వెడ్డింగ్ కార్డు తయారు చేసినట్లు చెప్పారు. ఈ పెళ్లి పత్రిక.. తమ భవిష్యత్ తరాలకు ఒక జ్ఞాపికగా మిగిలిపోవాలని కోరుకున్నానని అన్నారు. ఆహ్వాన పత్రిక మధ్యలో వధూవరుల పేర్లు శృతి జోహ్రీ.. హర్ష్ సోని.. లోపలి భాగంలో కుటుంబ సభ్యుల పేర్లను కూడా వెండిపైనే చెక్కించారు. ఆ వెడ్డింగ్ కార్డు తయారు చేయడానికి 128 వెండి ముక్కలను ఉపయోగించారు. ఆశ్చర్యం ఏంటంటే.. ఆ కార్డును అమర్చడానికి ఎక్కడా ఒక్క మేకు లేదా స్క్రూను కూడా వాడలేదు. వెండి కార్డుపై అతి సూక్ష్మంగా దాదాపు 65 మంది దేవతల ఫోటోలను చెక్కారు. వెడ్డింగ్ కార్డు పై భాగంలో వినాయకుడు, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు కొలువై ఉన్నారు. వీరితోపాటు.. శ్రీకృష్ణుడి జీవిత ఘట్టాలు, విష్ణుమూర్తి దశావతారాలు.. 8 రూపాల్లో అష్టలక్ష్మి ప్రతిమలను పొందుపరిచారు. ఇక కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి రెండు రూపాల్లో దర్శనమివ్వగా.. శంఖుచక్రాలు, ఏనుగులు పూల వర్షం కురిపిస్తున్నట్లుగా అత్యంత కళాత్మకంగా ఆ వివాహ ఆహ్వాన పత్రికను తీర్చిదిద్దారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jr NTR: దండోరా మూవీపై ఎన్టీఆర్ రివ్యూ

Akshay Kumar: ప్రమాదం నుంచి తప్పించుకోవడమే కాదు క్షతగాత్రులకు సాయం చేసిన స్టార్ హీరో

Chiranjeevi: ‘మీరు లేనిదే.. నేను లేను’ మెగాస్టార్ ఎమోషనల్

Naveen Polishetty: రూ.100 కోట్ల ఆనందంలో.. నవీన్ భావోద్వేగం

Chiranjeevi: బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌లో.. మెగాస్టార్ ఆల్ టైం రికార్డ్‌