ప్రియుడిని పిలిచి ప్లాన్ చేసి.. భర్తను వాకింగ్‌కు తీసుకెళ్లింది.. కట్ చేస్తే..

Updated on: Feb 06, 2026 | 4:40 PM

పెళ్ళైన మూడు నెలలకే ఆశిష్‌ను అతని భార్య అంజూ, ప్రియుడు సంజూ కలిసి దారుణంగా హత్య చేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఈ కేసులో, పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. భర్తను వాకింగ్‌కు తీసుకెళ్లి, ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర పన్నిన అంజూ తీరు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయా హనీమూన్ మర్డర్ కేసును గుర్తుచేసింది.

పెళ్లయిన మూడు నెలలకి వాకింగ్‌కు వెళ్లారు కొత్త జంట ఆషిష్‌, అంజు. రోడ్డు మీద వెళుతున్న వీరిని ఓ కారు ఢీకొట్టడంతో ఆషిష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు అంజు నగలను లాక్కెళ్లారు దుండగులు. ఆమె స్పృహతప్పి రోడ్డు మీద పడిపోయింది. రోడ్డు ప్రమాదం కేసుగా ముందు భావించారు పోలీసులు. అయితే విచారణలో బయటపడ్డ ట్విస్ట్‌లు వారి మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా చేసాయి. గతేడాది కొత్తగా పెళ్లయిన రాజా రఘువంశీని హనీమూన్‌ పేరుతో మేఘాలయాలో భార్య సోనమ్‌ హత్య చేయించిన కేసు గుర్తొచ్చి షాకయ్యారు. మేఘాలయాలో జరిగిన హనీమూన్‌ మర్డర్‌ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వాకింగ్‌కు వెళ్దామని తీసుకెళ్లి.. భర్తను ప్రియుడితో కొట్టి చంపించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. పోలీసుల వివరాల ప్రకారం..రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌కు చెందిన ఆశిష్‌కు మూడు నెలల కిందట అదే ప్రాంతానికి చెందిన అంజూతో వివాహమైంది. అయితే, కొన్ని రోజులకే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో అంజూ పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత పెద్దల సమక్షంలో సమస్య పరిష్కారమవడంతో మళ్లీ అత్తింటికి వచ్చింది. జనవరి 30 రాత్రి 9 గంటల సమయంలో వీరిద్దరూ రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉండగా అటుగా వెళ్తున్న కొందరు సఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆశిష్‌ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. గుర్తుతెలియని వాహనం తమను ఢీకొట్టిందని, ఆ తర్వాత అందులో నుంచి కొందరు వ్యక్తులు దిగి తనను బెదిరించి నగలు దోచుకెళ్లినట్లు అంజూ విచారణలో తెలిపింది. అయితే, ఆమె చెప్పిన సమాధానానికి, ఘటనా స్థలంలోని పరిస్థితులకు పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అంతేగాక, అంజూకు ఎలాంటి గాయాలు కాకపోవడం, ఆశిష్‌ ఒంటిపై గాయాలు ఉండటంతో పోలీసులు ఆమెను గట్టిగా విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అంజూ పెళ్లికి ముందు తన ఇంటి సమీపంలో నివసించే సంజూని ప్రేమించినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. వివాహం తర్వాత కూడా అతడితో ఫోన్‌లో టచ్‌లో ఉన్నట్లు తెలిపారు. పుట్టింటికి వెళ్లిన సమయంలో బాయ్‌ఫ్రెండ్‌ను కలిసిన ఆమె.. భర్త హత్యకు కుట్ర పన్నినట్లు తెలిపారు. ఘటన జరిగిన రాత్రి ఆశిష్‌ను తీసుకుని అంజూ నిర్మానుష్య రోడ్డుపై వాకింగ్‌కు వెళ్లిందని.. అప్పటికే అక్కడ సంజూ తన స్నేహితులతో కలిసి మాటు వేసినట్లు తెలిపారు. వారంతా ఆశిష్‌పై దాడి చేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అంజూ ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందనీ ఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సముద్రంలో 4 కి.మీ ఈది, కుటుంబాన్ని కాపాడుకున్న 13 ఏళ్ల బాలుడు

ప్రయాణికుడిపై పడిన వేడి వేడి కూర.. విమాన సంస్థకు దిమ్మ తిరిగే జరిమానా

Gold Price Today: రోజు రోజుకి భారీగా పడిపోతున్న బంగారం, వెండి ధరలు

ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇచ్చే ప్రీ-యోగా’ ఫుడ్స్

ఆ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ధర.. రూ 2.08 కోట్లు .. కొన్నది ఎవరంటే ??