తలుపు తీసి ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి..గదిలో సీన్ చూసి షాక్ వీడియో
రంగారెడ్డి జిల్లాలోని కుర్మిద్ద గ్రామ సమీపంలో గొర్రెల కాపరి సముద్రాల అంజయ్య గదిలోకి వెళ్ళగా, అక్కడ పెద్ద కొండచిలువ చుట్టుకుని కనిపించింది. భయంతో పరుగులు తీసిన అతను గ్రామస్తులకు సమాచారం అందించాడు. అటవీ అధికారులు రెండు గంటలు శ్రమించి కొండచిలువను బంధించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం కుర్మిద్ద గ్రామ సమీపంలో ఒక ఊహించని సంఘటన చోటుచేసుకుంది. గత కొంతకాలంగా వెంచర్ ప్రాంతంలో గొర్రెలను కాస్తూ జీవనం సాగిస్తున్న సముద్రాల అంజయ్యకు విస్మయం కలిగింది. రోజూ మాదిరిగానే శనివారం అతను పని నిమిత్తం వెంచర్‌లోకి వెళ్ళాడు. అక్కడ ఓ గది నుండి వింత శబ్దాలు వినిపించడంతో, ఏమై ఉంటుందని తెలుసుకోవాలనే ఆత్రుతతో లోపలికి ప్రవేశించాడు. ఆ క్షణమే అతను జీవితంలో షాక్ అయ్యే దృశ్యం కంటపడింది. ఒక పెద్ద కొండచిలువ చుట్టలా చుట్టుకుని ఉండటం చూసి భయంతో వణికిపోయాడు. వెంటనే ఆ గది నుండి పరుగులు తీసి గ్రామస్తులకు సమాచారం అందించాడు.
