ఆలయ ప్రాంగణంలో వింత ఆకారం.. విద్యుత్‌ కాంతుల మధ్య ధగధగా మెరుస్తూ

Updated on: Oct 16, 2025 | 8:26 PM

ఇటీవల కాలంలో వనాలు, అడవుల్లో ఉండాల్సిన జంతువులు, పాములు ఆహారం వెతుక్కుంటూ జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఒక్కోసారి ఆ ప్రాణులే ప్రమాదాల్లో పడుతున్న ఘటనలూ ఉన్నాయి. తాజాగా ఓ ఆలయ ప్రాంగణంలోకి ఓ భారీ కొండచిలువ వచ్చింది. పండుగల సీజన్‌ నడుస్తుండటంతో ఆలయాలన్నీ విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తున్నారు.

అలా విద్యుత్‌ దీపాలతో వెలిగిపోతున్న ఓ శివాలయం ప్రాంగణంలోకి చొరబడింది కొండచిలువ.కొమురం భీం జిల్లా కౌటాల మండలంలోని పాత శివాలయం సమీపంలో భారీ కొండచిలువ కలకలం రేపింది. దాదాపు మూడు మీటర్ల పైనే పొడవున్న ఆ కొండ చిలువ ఆలయం వెనుక ప్రహరీ గోడ పక్కనుంచి జరజరా పాకుతూ వెళ్తుండగా స్థానికులు గమనించారు. అంత పెద్ద పామును చూసి భయంతో పరుగులు తీశారు. అనంతరం స్నేక్‌ క్యాచర్‌కు సమాచారమివ్వడంతో అక్కడికి చేరుకొని పామును బంధించారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్‌ దీపాల వెలుగులో ధగధగా మెరుస్తున్న కొండచిలువ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆరు పదుల వయసులోనూ గుర్రంపై సవారీ.. అదుర్స్‌

కోతి చేతిలో నోట్ల కట్టలు.. చెట్టెక్కి చెలరేగిపోయిన వానరం

ప్రయాణీకులకు అలర్ట్.. రైళ్లలో అవి తీసుకెళ్తే రూ.1000 జరిమానా

చితిపై ఉంచగానే మృతదేహం నుంచి ఓంకారం

విమాన టికెట్ ధర.. ఇక ఫిక్స్..