రూ.3 కోట్ల బెంజ్ కారు కొన్న రైతు.. ధోతీ కట్టుకొని వచ్చి ..

Updated on: Oct 19, 2025 | 10:25 AM

ఓ రైతు 3 కోట్లు విలువ చేసే ఖరీదైన కారు కొన్నారు. ఆ కారు డెలివరీ తీసుకోవడానికి ధోతీ ధరించి షో రూమ్‌కు వెళ్లారు. పంజాబ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. తలపాగా, ధోతీలో.. భార్యను వెంటబెట్టుకొని తమ బెంజ్ షో రూమ్‌కి వచ్చిన ఆ రైతుకు షో రూమ్‌ వాళ్లు ఘన స్వాగతం పలికారు. లోపలికి రాగానే వాళ్లను మిలమిలా మెరుస్తున్న బ్లాక్ కలర్ బెంజ్ కారు వద్దకు తోడ్కొని పోయారు.

ఆ రైతు భార్య ఆ కారుకు పూజలు చేసిన తర్వాత.. షో రూమ్ మేనేజర్ .. రైతుకు కారు కీస్‌ను అందించారు. తర్వాత ఆ దంపతులిద్దరూ..ఆ కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘పంజాబ్ రైతులకు ఖరీదైన కార్లు ఉండటం సాధారణం. ఇదేం పెద్ద విషయం కాదు’ అని కొందరు వ్యాఖ్యానించారు. కాగా, ‘దేశంలో రైతులు పంటలు పండక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పంజాబ్‌లో మాత్రం ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు’ అంటూ మరికొందరు విమర్శలకు దిగారు. గతంలో కర్ణాటకలోని ఓ రైతు ఖరీదైన కారు కొనుగోలు చేసిన వీడియో వైరల్‌ అయింది. లగ్జరీ కారు డెలివరీ తీసుకోవడానికి సంజు అనే.. రైతు ఎడ్ల బండి పై టయోటా షోరూమ్‌కు వచ్చారు. అతని ఎంట్రీ ప్రత్యేకంగా నిలవడంతో అప్పట్లో వీడియోను జనం తెగ చూసారు. వ్యవసాయం చేసే అతని వద్ద ఖరీదైన కార్ల కలెక్షన్‌ ఉండటం అందరిని ఆశ్చర్యపరిచింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్ వాసికి రష్యాలో నరకం.. బలవంతంగా యుద్ధ రంగం లోకి