ఆశ్చర్యం..కోడి పిల్లలను పొదిగిన కోడిపుంజు

Updated on: Oct 03, 2025 | 4:55 PM

సాధారణంగా కోడిగుడ్లను.. కోడిపెట్ట పొదిగి పిల్లలను చేస్తుంది. అనంతరం వాటిని కంటికి రెప్పలా కాపాడుతూ వాటిని వెన్నంటే ఉంటుంది. వాటికి ఆహారాన్ని అందిస్తుంది. ఇతర పశుపక్ష్యాదులు వాటిని ఎత్తుకెళ్లిపోకుండా అనుక్షణం రక్షణగా ఉంటుంది. కానీ పూణేలో ఈ పనులన్నీ ఓ కోడిపుంజు చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

పూణేలోని భోర్ తాలూకా వాథర్ హిమా గ్రామానికి చెందిన రైతు అర్జున్ ఖట్పే కొన్నాళ్లుగా కోళ్లను పెంచుతున్నాడు. ఈ క్రమంలో ఆయన దగ్గరున్న వాటిలో ఓ కోడిపెట్ట.. కొన్ని గుడ్లను పొదిగి పిల్లలను చేసింది. పిల్లలను కాపాడుకునే క్రమంలో ఓ వీధికుక్క దాడిలో కోడి పెట్ట మరణించింది. దాంతో ఆ కోడిపిల్లలు అనాథలైపోయాయి. తల్లి లేని ఆ బుల్లి బుల్లి కోడిపిల్లలను రక్షించేది ఎలా అని ఇంటి యజమాని ఆవేదన చెందాడు. ఆ పిల్లలను బయటకు వదలకుండా ఇంటి షెడ్‌లోనే ఉంచాడు. ఆ కోడి పిల్లలను.. ఇతర కోడిపెట్టలు దగ్గరకు రానీయలేదు. ఈ క్రమంలో.. ఆయన దగ్గరున్న ఓ కోడిపుంజు.. ఆశ్చర్యంగా ముందుకొచ్చింది. ఎంత విచిత్రమంటే…. ఆ పుంజు.. కోడి పిల్లలకు తల్లిలా మారి.. ఇతర పక్షులనుంచి కాపాడుతోంది.సాయంత్రం పిల్లలను తన రెక్కలకింద దాచుకుంటూ వెచ్చదనాన్ని అందిస్తోంది. వాటికి తన ముక్కుతో ఆహారం తినిపిస్తోంది. అటు..ఆ కోడి పిల్లలు కూడా ఆ పుంజును ఒక్క క్షణం కూడా వదిలిపెట్టడం లేదు. కాగా, తన 80 ఏళ్ల జీవితంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదని కోళ్ల యజమాని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ కోడిని తాము అమ్మబోమని, చివరివరకూ దానిని జాగ్రత్తగా చూసుకుంటామని రైతు కుటుంబం తెలిపింది. పిల్లలను కోడిపెట్టలా సాకుతున్న ఈ కోడిపుంజును చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రైతు ఇంటికి క్యూ కడుతున్నారు. జంతువుల్లో కూడా ఇంతటి ప్రేమ, బాధ్యత ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Deepika Padukone: తగ్గేదేలే అంటున్న దీపికా పదుకొనే..

దసరా సందడంతా డబ్బింగ్ సినిమాలదే

రూ.50 కోట్ల బీమా కోసం ఎంతకు తెగించాడంటే.. భార్య, తల్లిదండ్రుల హత్య

సంక్రాంతి ఫైట్‌.. ఫైనల్‌ లిస్ట్‌లో ఆ నలుగురు

డివైడర్ ను ఢీ కొట్టిన కారు.. ముగ్గురు సజీవ దహనం