అర్చనలు చేయాల్సిన పూజారి అడ్డదారిలో వెళ్లాడు.. చివరికి..
వృత్తి అర్చకత్వం.. చేసే ఉద్యోగం దేవుడి గుడిలో పూజారి. ప్రవృత్తి మాత్రం గంజాయి అక్రమ రవాణా.. సీన్ కట్ చేస్తే రెడ్ హ్యాండెడ్ గా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు దొరికిపోయాడు ఓ పూజారి. గుంతకల్లు పట్టణంలోని హనుమాన్ సర్కిల్లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ అండ్ ప్రొఫెషన్ అధికారులు అరెస్టు చేశారు.
వీరి వద్ద నుండి నాలుగు కిలోల గంజాయిని, బైకును సీజ్ చేశారు. అరెస్ట్ అనంతరం నిందితులను విచారించిన ఎక్సైజ్ పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గంజాయి అక్రమ రవాణాలో దొరికిన మోహన్ సుందర్ పశ్చిమగోదావరి జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందినవాడు. అతను గుత్తి మండలం అబ్బే దొడ్డి గ్రామంలో ఉన్న రాముడి దేవాలయంలో పూజారిగా పని చేస్తున్నాడు. మరో నిందితుడు సాయికుమార్ గుత్తి పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. వీరిద్దరూ కలిసి గంజాయిని అక్రమ రవాణా చేస్తూ ఎక్సైజ్ ప్రొహబిషన్ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. పక్కా సమాచారంతో రెక్కీ నిర్వహించిన ఎక్సైజ్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దేవాలయంలో పూజారిగా ఉంటూ మోహన్ సుందర్ గంజాయి విక్రయం చేసి సొమ్ము చేసుకుంటున్నట్లు తమ విచారణలో తేలిందని చెప్పారు. నిందితులు.. గంజాయిని ఎక్కడినుండి తీసుకొస్తున్నారు??? ఎంతకాలంగా ఈ వ్యాపారం చేస్తున్నారు,… దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారా?? అన్న విషయం పూర్తి విచారణలో తెలుస్తుందని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దీపావళి సెలవులు పొడిగింపు! తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా
పంట రక్షణకు.. పగటి వేషం నిజమైన ఎలుగుబంటి అనుకొని
సంస్కరణ బాటలో రైల్వే శాఖప్రయాణికులకు మంచి రోజులు
