May Flower: ముందే పూసిన మే ఫ్లవర్..! చూసేందుకు రెండు కళ్ళు సరిపోని ఇదో అద్భతం..

|

May 05, 2022 | 10:03 PM

మన్యం గిరుల్లో అరుదైన పువ్వులు గుబాళిస్తున్నాయి ..! చక్కటి వర్ణం, ఆకారంతో ఆకట్టుకుంటున్నాయి. తమవైపు రారమ్మని పిలుస్తున్నాయి. అతిథిగా వచ్చిన ఆ పూలను జనం ఆసక్తిగా తిలకిస్తున్నారు. అల్లూరి జిల్లా ఏజెన్సీలో మే ఫ్లవర్స్ కనువిందు చేస్తున్నాయి.


మన్యం గిరుల్లో అరుదైన పువ్వులు గుబాళిస్తున్నాయి ..! చక్కటి వర్ణం, ఆకారంతో ఆకట్టుకుంటున్నాయి. తమవైపు రారమ్మని పిలుస్తున్నాయి. అతిథిగా వచ్చిన ఆ పూలను జనం ఆసక్తిగా తిలకిస్తున్నారు. అల్లూరి జిల్లా ఏజెన్సీలో మే ఫ్లవర్స్ కనువిందు చేస్తున్నాయి.ప్రతి ఏటా మే నెలలో పూచే ఈ పూలను మే ఫ్లవర్స్ అని పిలుస్తారు. గుబురుగా, బంతి ఆకారంలో, ఎర్రటి వర్ణంతో అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఏడాదంతా ఈ పూలు కనిపించవు. ఏడాదికి ఒకసారి మాత్రమే పూసే..ఈ పూల కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. అల్లూరి జిల్లాలో దాదాపు ప్రతి ఇంట్లో మే పూల మొక్కలు కనిపిస్తుంటాయి. మే నెలలో ఈ పూలతో దేవుళ్లను పూజించేందుకు అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఈసారి వింత ఏంటంటే.. ముందే ఈ పూలు పూస్తున్నాయి. ఏప్రిల్ చివరి వారంలో మే పూల మొగ్గలు విచ్చుకున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఏజెన్సీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముందుగానే ఈ పూలు విరబుస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.కోవిడ్ తర్వాత ఈ పువ్వులు మరింత ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఎందుకంటే ఈ పూలను చూసిన వారంతా సరదాగా కరోనా వైరస్ పూలని పిలుస్తున్నారు. ఎందుకంటే ఈ పూల ఆకారం.. కొవిడ్ వైరస్ ఆకారంలో సరిపోలి ఉంది. మే పూలు స్కాడొక్సస్ మల్టీ ఫ్లోరస్ జాతికి చెందినవి. ఇవి ఆఫ్రికా, సౌదీ అరేబియా, ఆంధ్ర ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. బ్లడ్ లిల్లీ, బాల్ లిల్లీ, ఫైర్ బాల్ లిల్లీ అని అనే పేర్లతో కూడా ఈ పూలను పిలుస్తుంటారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Syllabus Pattu Job Kottu: పోలీస్‌ జాబ్‌ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..

Wedding Viral Video: సన్నికల్లు తొక్కమంటే.. ఏకంగా పెళ్లికూతురినే..! నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో..

Kangana Ranaut: ‘వాడు తాకరాని చోట తాకాడు’ .. ఆ మూర్ఖుడి గురించి నిజం చెప్పిన కంగన..

Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైనే మొదలెట్టేశారు.. పోటాపోటీగా వినూత్న ప్రయోగం..

Published on: May 05, 2022 10:02 PM