కోతి చేతిలో నోట్ల కట్టలు.. చెట్టెక్కి చెలరేగిపోయిన వానరం

Updated on: Oct 16, 2025 | 8:21 PM

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌‌లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఉదయం ఒక కోతి 500 రూపాయల నోట్లు ఉన్న బ్యాగ్‌ను పట్టుకుని చెట్టు ఎక్కేసింది. బ్యాగ్‌లో ఉన్న నోట్ల కట్టలను విప్పి చెల్లా చెదురుగా చెట్టు మీది నుంచి కింద పడేసింది. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో అక్కడున్న స్థానికులంతా కోతి విసిరిన నోట్లను అందుకునేందుకు ోటీ పడటంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది.

అయితే.. వారంతా ఆ నోట్లను బాధిత యువకుడికి తిరిగిచ్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని గంగానగర్ జోన్‌లోని సోరాన్ తహసీల్‌లోని ఆజాద్ సభగర్‌లో జరిగింది. ఒక యువకుడు తన బైక్‌ను అక్కడ పార్క్ చేసి, ఒక భూమిని రిజిస్టర్ చేయడానికి రెవెన్యూ ఆఫీసుకు వచ్చాడు. డబ్బును బైక్ ట్రంక్‌లో ఒక బ్యాగ్‌లో ఉంచాడు. అయితే..ఆ కోతి కూడా అక్కడికి సమీపంలోనే ఉంది. ఆ యువకుడు బైక్‌ నుంచి దూరం జరిగాక, ఆ కోతి బైక్ దగ్గరకు వచ్చింది. రాగానే, ఆ డబ్బాలో ఏదో తినే పదార్థం ఉందనుకుందో ఏమో గానీ.. టక్కున ఆ సంచీని బయటకు లాగింది. అది గమనించిన జనం.. ఆ బ్యాగ్‌ను తిరిగి తీసుకోవడానికి బైక్ దగ్గరకు రావటంతో.. భయపడిన కోతి బ్యాగ్‌తో సహా.. సమీపంలోని చెట్టు ఎక్కింది. దీంతో స్థానికులు.. పెద్దగా కేకలు వేస్తూ.. కింద నుండి కోతిపై రాళ్లు రువ్వారు. అయితే.. ఆ కోతి బ్యాగ్ కింద పడేయకపోగా.. అందులోని నగదు కట్టను తీసి.. చేతికొచ్చిన రీతిలో 500 నోట్లను కిందకు విసరటం మొదలుపెట్టింది. దీంతో.. జనం ఆ నోట్లను సేకరించి.. అక్కడే నిలబడిన యువకుడికి తిరిగి ఇచ్చారు. డబ్బులు అన్నీ దక్కడంతో ఆ యువకుడు ఊపిరి పీల్చుకున్నాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రయాణీకులకు అలర్ట్.. రైళ్లలో అవి తీసుకెళ్తే రూ.1000 జరిమానా

చితిపై ఉంచగానే మృతదేహం నుంచి ఓంకారం

విమాన టికెట్ ధర.. ఇక ఫిక్స్..

క్షణాల్లో కుప్పకూలిన కొత్త హైవే.. షాకైన జనం

ఇక.. రైలు టికెట్ ఇంటికే డెలివరీ