మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా? సొమ్ము చేసుకున్న విదేశీ బ్రాండ్‌

Updated on: Dec 17, 2025 | 5:39 PM

సాంస్కృతిక దోపిడీ ఆరోపణల తర్వాత ప్రాడా "మేడ్ ఇన్ ఇండియా" ప్రాజెక్ట్ ప్రారంభించింది. కొల్హాపురి చెప్పుల తయారీకి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. భారతీయ కళాకారులతో కలిసి లిమిటెడ్ ఎడిషన్ లగ్జరీ సాండల్స్ తయారు చేయనుంది. ప్రాడా అకాడమీలో శిక్షణ, సరైన పారితోషికం అందిస్తూ, భారతీయ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయనుంది. ఇది భారత లగ్జరీ మార్కెట్‌కు పెద్ద ప్రోత్సాహం.

2026 మెన్స్ కలెక్షన్‌లో ప్రాడా చూపించిన సాండల్స్‌ సంప్రదాయ కొల్హాపురి చప్పల్స్‌లా ఉన్నాయని, కానీ భారతీయ కార్మికులకు క్రెడిట్ ఇవ్వలేదని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. వీటిని ఏకంగా రూ. 1.12 ల‌క్ష‌ల‌కు విక్ర‌యించారు. దీంతో ప్రాడా సాంస్కృతిక దోపిడీ చేసిందని ఆరోపణలు వచ్చాయి. దాంతో ప్రాడా “PRADA Made in India ” పేరుతో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. దీంతో దిగొచ్చిన ప్రాడా భార‌తీయ క‌ళాకారుల‌తో కీల‌క ఒప్పందం చేసుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వంతో MOU పై సంతకం చేసింది. కొల్హాపురి చప్పల్స్‌ నుంచి ప్రేరణ పొందిన లిమిటెడ్ ఎడిషన్ సాండల్స్‌ను ప్రాడా రూ.85,000 ధరకు విడుదల చేయనుంది. కలెక్షన్‌లోని 2,000 జతల సాండల్స్ పూర్తిగా భారత్‌లోనే త‌యారీ చేయ‌నున్నారు. మహారాష్ట్ర, క‌ర్ణాట‌క‌లోని ఎనిమిది జిల్లాలకు చెందిన కార్మికులు స్వ‌యంగా చేతుల‌తో చెప్పుల‌ను త‌యారు చేస్తారు. ఇవి సంప్రదాయంగా ప్రత్యేక పద్ధతులతో చేతితో తయారుచేసే GI-ట్యాగ్ పొందిన చెప్పులు. ప్రాడా తమ తయారీ టెక్నాలజీని, భారతీయ సంప్రదాయ పద్ధతులతో కలిపి ప్రపంచానికి పరిచయం చేయనుంది. అంతేకాదు ప్రాడా భారతీయ కళాకారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వ‌నుంది. కొంతకాలం ఇటలీలోని ప్రాడా అకాడమీలో వారికి ట్రైనింగ్ అవకాశం క‌ల్పించింది. ఆ సమయంలో వారికి సరైన పారితోషికం అందిస్తుంది. ప్రాడా ఈ ప్రాజెక్టు కోసం కోట్ల‌లో ఖ‌ర్చు చేయ‌నుంది. ప్రాడా కొల్హాపురి చెప్పులను లగ్జరీ రేంజ్‌లో ప్రవేశపెట్టడం వల్ల డిమాండ్ భారీగా పెరిగింది. ప్రాడాకు ఇప్పటికే ఢిల్లీలో ఒక బ్యూటీ స్టోర్‌ ఉంది. 2024లో భారత లగ్జరీ మార్కెట్ విలువ 7 బిలియన్ డాలర్లు 2020 నాటికి $30 బిలియన్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే చైనా మార్కెట్‌తో పోలిస్తే ఇది త‌క్కువేన‌ని చెప్పాలి. ఇప్ప‌టి వ‌ర‌కు గ్లోబ‌ల్ బ్రాండ్లు ఇండియాలోకి అంబానీ లేదా ఆదిత్య బిర్లా గ్రూప్‌తో జ‌త‌క‌ట్ట‌గా.. ప్రాడా మాత్రం స్వంతంగా ప్రవేశించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్‌

బాక్సాఫీస్ విజయానికి కొత్త మంత్రం.. సినిమాలో ఇది ఉంటే హిట్ పక్కా

సీనియర్ హీరోలకు ఆప్షన్ లేదు.. ఇంకా వారే దిక్కు

నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అంటున్న కుర్ర హీరోలు..

2 వారాలు.. 12 సినిమాలు.. దండయాత్రే