బంగారం, వెండిధరల ఎఫెక్ట్‌.. రెచ్చిపోయిన దొంగలు

Updated on: Feb 01, 2026 | 2:44 PM

హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు పెరగడంతో దొంగలు రెచ్చిపోతున్నారు. అల్వాల్‌లోని మమతా సాయి జ్యువెలర్స్‌లో అర్ధరాత్రి భారీ వెండి చోరీ జరిగింది. మేడ్చల్ జిల్లా చెంగిచర్లలో వరుస చోరీలకు పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో పాత నేరస్తులు మహాదేవ్, పవన్ గుప్తా, మంగల్ సింగ్ ఉన్నారు. ఈ ఘటనలతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.

హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ పరిస్థితి చోరీలకు దారితీస్తోంది. తాజాగా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవెన్యూ కాలనీలోని మమతా సాయి జ్యువెలర్స్‌లో అర్ధరాత్రి ముగ్గురు దొంగలు చోరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. షట్టర్‌ను బలవంతంగా బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు సుమారు కిలో వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ చోరీ విలువ ఐదు లక్షల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవడంతో అల్వాల్ పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. దొంగల కదలికలను ట్రాక్ చేసేందుకు చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లతో సమన్వయం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీడి ట్యాలెంట్‌కి హ్యాట్సాఫ్‌.. 15 సెకెండ్లలోనే మాయం చేస్తాడు..

శ్రీవారి ఆలయం ముందు ఇదేం పని.. అది తిరుమల రా అయ్యా

తులసి వనంలో గంజాయి మొక్క అంటే ఇదేనేమో

Vitamin D: విటమిన్ డి ట్యాబ్లెట్లు తీసుకునే సరైన సమయం ఇదే

కొడుకు ప్రాణాల కోసం చిరుతతో పోరాడిన తండ్రి.. చివరికి

Loading...
Unable to load recommendations.
Follow Us