Judge vs Lawyers: కోర్టులోనే లాయర్లను చితకబాదిన పోలీసులు.. వీడియో వైరల్.!

|

Nov 04, 2024 | 11:31 AM

కోర్టు హాల్లోనే లాయర్లపై పోలీసులు లాఠీలు ఝలిపించారు. నల్లకోటు వేసుకున్న లాయర్లను ఖాకీ చొక్కా ధరించిన పోలీసులు చితకబాదారు. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. ఊహించని ఈ ఘటనతో ఉత్తరప్రదేశ్‌ లోని ఘజియాబాద్‌ జిల్లా కోర్టులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సమయంలో జడ్జికి , లాయర్‌కు మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది.

జడ్జి, లాయర్‌ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తరువాత ఆ న్యాయమూర్తి.. పోలీసులను కోర్టుకు రప్పించారు. జడ్జి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లాయర్లు కోర్టులో ఆందోళన చేపట్టారు. కోర్టులో లాయర్లకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. లాయర్లపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. కుర్చీలతో దాడికి పాల్పడ్డారు. లాఠీఛార్జ్‌లో పలువురు లాయర్లకు గాయాలయ్యాయి. దీంతో కోర్టు బయట లాయర్లు ఆందోళన చేపట్టారు. పరిస్థితిని అదుపు చేయడానికి పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపారు.

బార్ అసోసియేషన్ అధికారి కేసుకు సంబంధించి న్యాయవాదికి, న్యాయమూర్తికి మధ్య వాగ్వాదం జరగడంతో గందరగోళం చెలరేగింది. పోలీసులు, లాయర్ల మధ్య జరిగిన ఘర్షణ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటన తర్వాత న్యాయవాదులంతా కోర్టును బాయ్ కాట్‌ చేశారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.