PM Modi: కంటి చూపులేని చిన్నారి మాటలకు.. ఫిదా అయిన ప్రధాని మోదీ

Updated on: Jul 08, 2022 | 9:28 AM

ఓ 11 ఏళ్ల దివ్యాంగ చిన్నారితో ముచ్చటించిన ప్రధాని.. ఆ బాలుడ్ని చూసి ముచ్చటపడిపోయారు. ఆ చిన్నారిని కలిశాక.. ఈ దేశం ఎక్కడా ఆగిపోదని తనలో విశ్వాసం మరింత పెరిగిందని గుజరాత్‌లో జరుగుతున్న ‘డిజిటల్‌ భారత్‌’ వారోత్సవాలలో ఆనందం వ్యక్తం చేశారు..

ఓ 11 ఏళ్ల దివ్యాంగ చిన్నారితో ముచ్చటించిన ప్రధాని.. ఆ బాలుడ్ని చూసి ముచ్చటపడిపోయారు. ఆ చిన్నారిని కలిశాక.. ఈ దేశం ఎక్కడా ఆగిపోదని తనలో విశ్వాసం మరింత పెరిగిందని గుజరాత్‌లో జరుగుతున్న ‘డిజిటల్‌ భారత్‌’ వారోత్సవాలలో ఆనందం వ్యక్తం చేశారు.. డిజిటల్‌ ఇండియా వారోత్సవాలను ప్రారంభించిన ప్రధాని.. అక్కడ ప్రదర్శనకు ఉంచిన పలు నూతన ఆవిష్కరణలను తిలకించారు. ఈ సందర్భంగా థింకర్‌బెల్‌ ల్యాబ్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న 11 ఏళ్ల ప్రథమేశ్‌ సిన్హాతో ప్రధాని ముచ్చటించారు. ఈ సంస్థ అంధులు బ్రెయిలీ లిపిని సులభంగా నేర్చుకునేందుకు వీలుగా ‘ఆన్నీ’ అనే గ్యాడ్జెట్‌ను తయారు చేసింది. ప్రథమేశ్‌ ఈ పరికరం గురించి ప్రధానికి వివరించాడు. అతడు చెబుతున్నంతసేపు ఎంతో ఆసక్తిగా విన్న మోదీ.. ‘నువ్వు ఎక్కడి నుంచి వచ్చావ్‌?’ అంటూ చిన్నారిని అడిగారు. ‘పుణె నుంచి వచ్చాను’ అని చెప్పగా.. మోదీ చిన్నారి తలనిమిరి అభినందించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అధికారులకు కవలల బురిడీ.. ఒకరి పాస్‌పోర్ట్‌తో ఒకరు 30 సార్లు విదేశాలకు

ఎగురుతున్న విమానానికి రంధ్రం.. పైలట్లు ఏం చేశారంటే

Published on: Jul 08, 2022 09:28 AM