Plane Tire: టేకాఫ్ సమయంలో పేలిన విమానం టైరు.. వీడియో వైరల్.

|

Jul 14, 2024 | 4:04 PM

టేకాఫ్ చేసేందుకు రన్‌వే పైకి వస్తుండగా ఓ విమానం టైరు అకస్మాత్తుగా పేలిపోయింది. అమెరికాలోని ఫినిక్స్‌లో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 590 విమానం బుధవారం ఉదయం 8 గంటలకు టాంపా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

టేకాఫ్‌ కోసం టాక్సీ వే మీద నుంచి రన్‌‌వే మీదకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టైరు పేలడంతో విమానం చక్రాల్లోంచి ఒక్కసారిగా నిప్పురవ్వలు, పొగలు విరజిమ్మాయి. కొన్ని క్షణాల తరువాత విషయాన్ని గుర్తించిన పైలట్ వెంటనే టేకాఫ్ ప్రయత్నాన్ని విరమించాడు. ఘటన సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. అయితే, వారెవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని, విమానాశ్రయ కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం ఏర్పడలేదని అమెరికా పౌర విమానయాన విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులను మరో విమానంలో వారి గమ్యస్థానాలకు చేర్చినట్టు పేర్కొంది. కాగా, ఒకటికి మించి విమానం టైర్లు పేలినట్టు అనుమానాలు వ్యక్తం కావడంతో ఘటనపై దర్యాప్తు చేస్తామని వెల్లడించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.