5 గంటలపాటు రన్‌వే పైనే విమానం.. ఊపిరాడక చిన్నారులు, వృద్ధులకు అస్వస్థత
విమానంలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా ప్రయాణికుల్లోని చిన్నారులు, వృద్ధులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొన్ని గంటలపాటు విమానంలోనే ఉండిపోవడంతో ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానం టేకాఫ్ చేస్తుండగా సాంకేతిక సమస్య ఏర్పడటంతో విమానాన్ని రన్‌వేపైనే ఉంచారు. అయితే ప్రయాణికులను కిందకు దిగేందుకు అనుమతించలేదు. అలా 5 గంటలపాటు విమానంలోనే ఉండిపోయారు.
విమానంలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా ప్రయాణికుల్లోని చిన్నారులు, వృద్ధులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొన్ని గంటలపాటు విమానంలోనే ఉండిపోవడంతో ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానం టేకాఫ్ చేస్తుండగా సాంకేతిక సమస్య ఏర్పడటంతో విమానాన్ని రన్‌వేపైనే ఉంచారు. అయితే ప్రయాణికులను కిందకు దిగేందుకు అనుమతించలేదు. అలా 5 గంటలపాటు విమానంలోనే ఉండిపోయారు. ఈ ఘటన ముంబై ఎయిర్‌పోర్ట్‌లో శనివారం చోటుచేసుకుంది. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ మారిషస్ కు చెందిన MK749 విమానం ముంబైనుంచి మారిషష్‌కు శనివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు బయలుదేరాల్సి ఉంది. 3.45 గంటలకు ప్రయాణికుంలందరినీ విమానం ఎక్కించారు. అయితే టేకాఫ్ చేస్తుండగా ఇంజిన్‌లో సమస్య ఏర్పడింది. దీంతో విమానాన్ని రన్‌వేపైనే ఉంచారు. కానీ, ప్రయాణికులను కిందకు దిగేందుకు అనుమతించకపోవడంతో దాదాపు 5 గంటలు విమానంలోనే ఉండిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆగస్టు 1న జీమెయిల్ సర్వీసులు నిలిచిపోనున్నాయా ??
ఊళ వేయడం మానేసి నిశ్శబ్దంగా ఉంటున్న తోడేళ్లు.. కారణమేంటంటే ??
25 రోజులు పచ్చి చికెన్ తిన్నాడు !! అయినా నో ఫుడ్ పాయిజన్.. ఎలా ??
అమెరికాలో నెట్ వర్క్ లేక పనిచేయని సెల్ ఫోన్లు !! సైబర్ దాడే కారణమా ??