CISF Jawans: దేశ రక్షణే కాదు..ప్రాణాలూ కాపాడగలం.. ఓ వ్యక్తి కి ప్రాణదానం చేసిన జవాన్స్ సెల్యూట్ అంటున్న నెటిజన్లు.. వీడియో.

Updated on: Oct 05, 2022 | 5:36 PM

దేశ సరిహద్దులో శత్రువుల నుంచి రక్షణ కల్పించే సైనికులు.. తమ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడతారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా దేశ సేవే ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ రేయింబవళ్లు


దేశ సరిహద్దులో శత్రువుల నుంచి రక్షణ కల్పించే సైనికులు.. తమ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడతారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా దేశ సేవే ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ రేయింబవళ్లు కాపలా కాస్తుంటారు. వారు విధులు నిర్వర్తించే దృశ్యాలు, సన్నివేశాలు చూస్తే గూస్ బంప్స్ వస్తుంటాయి. వారి సాహసాన్ని, దేశ భక్తిని మెచ్చుకోకుండా ఉండలేం. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. వారి వీడియోలు చూసేందుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. గుండెపోటు వచ్చిన వ్యక్తికి జవాన్లు సపర్యలు చేస్తున్న దృశ్యాలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. చెన్నై ఎయిర్ పోర్ట్ లో ఓ ప్రయాణికుడికి ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దాంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమయానికి అక్కడే ఉన్న సీఐఎస్ఎఫ్ జవాన్లు అతనిని గమనించారు. వెంటనే అలర్ట్ అయ్యి.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా సీపీఆర్‌ చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.ఈ వీడియో ట్విట్టర్ వేదికగా పోస్ట్ అయింది. వీడియోను చూసిన నెటిజన్లు జవాన్లు చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. మానవత్వం ప్రదర్శించిన ఈ సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధిన దృశ్యాలు ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడువతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

Published on: Oct 05, 2022 05:36 PM