Panda viral video: పాపం పాండా.. మంచులో పడుతున్న తిప్పలు చూస్తే..వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
పాండా.. అచ్చం ఎలుగుబంటిలా ఉండే అరుదైన జంతువు. ఎంతో క్యూట్‌గా అందరినీ ఆకర్షించే జంతువు ఇది. అంతేకాదు ఇది పూర్తి శాఖాహార జంతువు. వెదురు తింటూ జీవనం సాగిస్తుంది.
ఇంటర్‌నెట్‌లోనూ పాండా వీడియోలు విపరీతంగా వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఈ పాండాకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతూ ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఈ వీడియోలో మంచులో ఓ పాండా ఆడుకుంటూ కనిపిస్తుంది. మంచులో పడిలేస్తూ.. అది చేసే చిలిపి చేష్టలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. ఈ క్యూట్ వీడియోను ఏకంగా 2 కోట్లకు పైగానే నెటిజన్లు వీక్షించారు. లక్షల్లో లైక్ చేస్తున్నారు. పాండా చాలా క్యూట్‌గా ఉందని, ఎంతో ఉల్లాసంగా గడుపుతోందని ఓ యూజర్ కామెంట్ చేసారు. ఈ క్యూటీ తన రోజును ఎంతో ఆనందమయం చేసిందని మరో యూజర్ రాసుకొచ్చారు. ఇలాంటి చబ్బీ స్వీటీస్‌తో ప్రేమలో పడకుండా ఎవరుంటారని మరో యూజర్ ప్రశ్నించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Published on: Dec 02, 2022 10:12 PM