నాగబంధనం వేసిన గ‌దిని తెరిచేది ఎప్పుడు? అనంత ప‌ద్మ‌నాభ‌ ఆలయ గది రహస్యం ఏంటి!

Updated on: Aug 12, 2025 | 8:25 PM

కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభస్వామి దేవాలయం ప్రపంచలోనే అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయ నేలమాళిగల్లో ఏడు రహస్య గదులు ఉన్నాయి. వీటిలో రాశుల కొద్ది బంగారు, వజ్రవైడ్యుర్యాలు, స్వర్ణ విగ్రహాలు కనుగొన్నారు. కొన్నేళ్ల క్రితం తెరిచిన 6 గదులలో బయటపడిన బంగారం 5 లక్షల కోట్లు విలువ ఉంటుందని అంచనా వేశారు.

ఆలయ బాధ్యతను ట్రావెన్ కోర్ రాజకుటుంబానికి తిరిగి అప్పగిస్తున్నట్లు సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఆరు గదులు తెరిచినప్పటికీ ఏడవ గదిని మాత్రం ఇంకా తెరవలేదు. నాగబంధనం వేసి ఉండటంతో తెరవడం సాధ్యం కాదని పండితులు తెలిపారు. ఆ గదిలో ఈ ఆరు గదుల్లో ఉన్నదానికంటే రెట్టింపు సంపద ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ గదిలో ఎంత సంపద ఉంటుందో అనేది ఆ అనంతుడికే తెలిసిన రహస్యం. వెల కట్టలేని నిధుల రాశిని స్వామివారికి అర్పించి తరతరాలుగా వాటిని సంరక్షిస్తున్నారు. తాజాగా ఆల‌యం నేల‌మాళిగ‌లోని ‘బీ’ గ‌దిని తెర‌వాల‌ని డిమాండ్ తెరపైకి వ‌చ్చింది. అడ్మినిస్ట్రేటివ్ క‌మిటీ తరపున రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తినిధిగా వేల‌ప్ప‌న్ నాయ‌ర్ మీటింగ్‌లో మాట్లాడారు. నేల‌మాళిగ‌లోని ‘బీ’ గ‌దిని తెరువాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. కానీ మిగితా స‌భ్యులు ఎవ‌రూ ఆ ప్ర‌తిపాద‌న‌కు స్పందించ‌లేదు. ఆల‌య ప్ర‌ధాన అర్చకుడిదే తుది నిర్ణయమని చెప్పగా ఆయన గురువారం జ‌రిగిన స‌మావేశానికి హాజ‌రుకాలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర‌కారం.. జూన్ 2011లో నేల‌మాళిగ‌లోని A గ‌దిని తెరిచారు. ఆ గ‌దిలో ఉన్న సంప‌ద‌ను ఇన్వెంట‌రీలో నమోదు చేసారు. అయితే B గ‌ది తెరిచే అంశంలో గ‌తంలో తీవ్ర అభ్యంత‌రాలు వచ్చాయి. ఆ గ‌దిని ఓపెన్ చేసే నిర్ణ‌యం టెంపుల్ అడ్మినిస్ట్రేటివ్‌, అడ్వైజ‌రీ క‌మిటీల‌కు వ‌దిలేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అతిగా ఉప్పు తీసుకుంటున్నారా? హార్ట్ ఎటాక్ ముప్పు తప్పదా

దేవుడ్ని మొక్కేందుకు వెళ్లిన భక్తులకు ఊహించని షాక్

ముఖ్యమంత్రి పేరును మర్చిపోయా క్షమించండి..

అభిమాని మూగ అభిమానం.. కరిగిపోయి కోరిక తీర్చిన NTR

అడ్వాన్స్ బుకింగ్స్‏లో వార్ 2 ఆల్ టైమ్ రికార్డ్..