కాఫీలు తాగారా? టిఫినీలు చేశారా? పెళ్లిలో యువతుల హడావుడి.. చివరికి
ఒంగోలులోని ఓ కళ్యాణ మండపంలో పెళ్లి సందడిలో భారీ చోరీ జరిగింది. బసవన్నపాలెం, మైనంపాడుల యువత వివాహంలో, వధువు గది నుండి 158 గ్రాముల బంగారం, రూ. 1.5 లక్షల నగదు అపహరణకు గురయ్యాయి. ఇద్దరు మహిళలు చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అదే పెళ్లిలో ఓ పెద్దమనిషికి రూ. 20 వేలు పోయాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి పెళ్లిళ్లలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఒంగోలు శివారులోని త్రోవగుంటలోని ఓ కళ్యాణ మండపంలో బసవన్నపాలెం గ్రామానికి చెందిన యువకుడికి, మైనంపాడుకు చెందిన యువతికి వివాహం జరుగుతోంది. అంతా పెళ్ళి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కాఫీలు తాగారా, టిఫినీలు చేశారా? అంటూ ప్రతి పెళ్ళిళ్ళలో కనిపించే దృశ్యం ఇక్కడ కూడా కనిపించింది. ఇద్దరు పడుచులు అందంగా ముస్తాబై పెళ్ళి మండపంలో సందడి చేస్తున్నారు. వధువు తరపు బంధువుల్లాగా వ్యవహరిస్తూ పెళ్లికుమార్తెకు కేటాయించిన గదిలోకి వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో చూసి.. వధువుకు చెందిన 158 గ్రాముల బంగారు నగలు, రూ. లక్షన్నర నగదు తీసుకుని హడావిడిగా గదినుంచి బయటకు వచ్చారు. హడావిడిగా వధువు గదినుంచి బయటకు వస్తున్న ఈ ఇద్దరు దొంగలను వధువు తరపు ఓ మహిళ గమనించింది. ఎవరు మీరు? ఏంటీ హడావుడి? అని ఆమె కాస్త గట్టిగా వారిని నిలదీసింది. దీంతో వారు హిందీలో పొంతనలేని సమాధానాలు చెప్పి వెళ్ళిపోయారు. ఆ తరువాత వధువు గదిలో నగలు కనిపించడం లేదన్న సమాచారం ఆలస్యంగా తెలుసుకున్న పెళ్ళి పెద్దలు చోరీ జరిగిందని తెలుసుకున్నారు. ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కళ్యాణమండపంలో పరిశీలించారు. 158 గ్రాముల బంగారు నగలు, 1.50 లక్షల నగదు చోరీకి గురయ్యాయని పెళ్ళివారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీకి పాల్పడిన వ్యక్తులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. వీరి సంగతి ఇలా ఉండగా, అదే పెళ్ళికి వచ్చిన ఓ పెద్దమనిషి జేబులోని రూ. 20 వేల నగదు కూడా పోయిన సంగతి వెలుగులోకి వచ్చింది. దీంతో, వీరి వెనక పెద్ద గ్యాంగ్ దిగి ఉంటుందని పెళ్లవారు అనుమానిస్తున్నారు. ఎంత బంధువులైనా పెళ్ళిళ్ళల్లో జాగ్రత్తగా ఉండాలి సుమా అంటూ చర్చించుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఊరెళ్లేటప్పుడు ఇల్లే.. ఇంటికి వచ్చేసరికి కోళ్ల ఫారం అయ్యింది.. అదే కదా మ్యాజిక్కు..
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దీనితో మీ సామాన్లు భద్రం
ఆధార్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ పని ఇంటినుంచే చేయచ్చు
లింగభైరవి దేవి అంతశక్తిగల దైవమా.. ఈ అమ్మ అనుగ్రహం పొందితే..
జామ్ జామ్ గా.. భుజాలపై కోతిని ఎక్కించుకుని బైక్ రైడ్.. మస్త్ ఫీల్ ఉందంటున్న బుచ్చిరాములు