Kadapa: ఇక్కడి వెంకటేశ్వరుడి తొలి పూజ ముస్లింలదే.! బావగారిగా వెంకన్నను కొలిచే ముస్లింలు

|

Apr 10, 2024 | 10:43 AM

కడపలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది రోజున ముస్లింలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ముస్లిం మహిళలు ఇక్కడకు భారీగా చేరుకొని వెంకటేశ్వర స్వామికి పూజలు చేసి తమ మొక్కులను చెల్లించుకున్నారు. బీబీ నాంచారమ్మను వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకోవడం వల్ల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇక్కడి ముస్లింలు బావగారిగా కొలుస్తారు.

కడపలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది రోజున ముస్లింలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ముస్లిం మహిళలు ఇక్కడకు భారీగా చేరుకొని వెంకటేశ్వర స్వామికి పూజలు చేసి తమ మొక్కులను చెల్లించుకున్నారు. బీబీ నాంచారమ్మను వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకోవడం వల్ల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇక్కడి ముస్లింలు బావగారిగా కొలుస్తారు. కడపలోని దేవాలయంలో ప్రతి ఏటా ముస్లింలు ఉగాది రోజున పూజలు నిర్వహించడం వెనక పెద్ద కారణమే ఉంది. వెంకటేశ్వర స్వామి రెండో భార్య అయిన బీబి నాంచారమ్మ ముస్లిం మహిళ కావడంతో.. ముస్లింలందరూ ప్రతి ఏడాది ఉగాది రోజున ఆయనను పూజిస్తారు. దేవుని గడప దేవాలయం అని కూడా పిలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వీరంతా మొక్కలను చెల్లిస్తారు. పుట్టింటి వారు చీర సారే ఎలా తీసుకువెళతారో అదే విధంగా బీబీ నాంచారమ్మను ఆడపడుచుగా భావిస్తూ ఆమెకు చీర సారే సమర్పిస్తారు. అందులో భాగంగానే వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించి వారి భక్తిని చాటుకుంటారు. వెంకటేశ్వర స్వామి తమ ఆడపడుచును చేసుకున్నాడు కాబట్టి ఆయనను బావగారిగా కొలవడం ఇక్కడి సంప్రదాయం. అందులో భాగంగానే ఉగాది రోజు తొలి పూజను వారే నిర్వహిస్తారు. అంతేకాక ఏటా తమ కోరికలను స్వామివారికి విన్నవిస్తారు. ఆయన వాటిని తీరుస్తారని విశ్వసిస్తారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..