కొబ్బరి బొండాం పీచును నోటితో వొలిచి.. సత్తా చాటిన మహిళ

Updated on: Dec 16, 2025 | 5:43 PM

ఒడిశా మహిళ ఒకరు పంటితో కొబ్బరి పీచును తీసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ అద్భుతమైన నైపుణ్యాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ మహిళ కేవలం పంటితో కొబ్బరి పీచు తీయడమే కాకుండా, బుల్లెట్ నడపడం వంటి ఇతర సాహసాలు కూడా సులభంగా చేయగలనని చెప్పింది. ఆమె ధైర్యం, శక్తి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఒడిశా మహిళ ఒకరు కొబ్బరి పీచును పంటితో తీసిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ ఆశ్చర్యకర సీన్‌ ను ఓ వ్యక్తి షూట్‌ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. కొబ్బరి బోండాం నీళ్లు ఆరోగ్యానికి మంచిది. కానీ అందుకు కాస్త కష్టపడాలి. కొబ్బరి బొండాం పై రంధ్రం చేయడానికి కొడవలి తెచ్చుకోవాలి. ఆ తర్వాతే కొబ్బరి నీళ్లను ఆస్వాదించగలం. కొబ్బరి పీచు తీయాల్సిన అవసరం లేదు కానీ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా చిక్కుల్లో పడతాం. వీడియోలో మహిళ కొబ్బరి పీచును పంటితో లాగేస్తానని చెప్పింది. వీడియో రికార్డు చేస్తున్న వ్యక్తి ఇది విని షాకయ్యాడు. నిజంగానా? అంటూ సందేహాన్ని వ్యక్తం చేశాడు. ఆమేమో అవునని కాన్ఫిడెంట్‌గా చెప్పింది. అన్నట్టుగానే పంటితో కొబ్బరి పీచును తొలగించింది. దీంతో ఎదురుగా ఉన్న వ్యక్తి నోట మాట రాలేదు. మహిళ చెప్పిన దాన్ని ముందు అతను నమ్మలేదు. కొన్ని నిమిషాల తరువాత మహిళ తన ప్రయత్నాన్ని విరమిస్తుందని అనుకున్నాడు. కానీ పీచు మొత్తాన్ని ఒలిచేయడంతో అబ్బురపడ్డాడు. చప్పట్లు కొట్టాడు. ఇలాంటి సాహసాలు చేయడం తనకు సాధారణమని ఆ మహిళ కాన్ఫిడెంట్‌గా చెప్పింది. తనకు బుల్లెట్ బైక్ లేదా కారు నడపడం కూడా ఈజీనే అని చెప్పింది. చేసి చూపించింది కూడా. తరువాత కొబ్బరి నీళ్లను గ్లాసులో పోసి ఇచ్చింది. దీంతో, ఆమె టాలెంట్‌కు తిరుగేలేదంటూ అతను జైకొట్టాడు. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. జనం ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఏ టూత్ పేస్టు వాడుతున్నారో చెప్పాలి మేడమ్‌ అంటున్నారు. ఒడిశా వాళ్ల టాలెంట్ మామూలుగా ఉండదని మరికొందరు అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jailer 2: విద్యాబాలన్ రీ-ఎంట్రీ.. పవర్‌ఫుల్ రోల్ లో కనిపించనున్న ముద్దుగుమ్మ

Thaman: టాలీవుడ్ లో యూనిటీ లేదు.. త‌మ‌న్ షాకింగ్ కామెంట్స్

పక్కా ప్లానింగ్ తో ఉన్న భాగ్యశ్రీ, రుక్మిణి.. 2026 మాదే అంటున్న ముద్దుగుమ్మలు

Nani: బిగ్ క్లాష్‌కు రెడీ అంటున్న నేచురల్ స్టార్‌

The Raja saab: ఫ్యాన్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రాజాసాబ్ టీమ్‌