కొత్త బిందెతో ఆడుకుంటుండగా అందులో ఇరుక్కున్న తల.. చివరకు వీడియో

Updated on: Aug 03, 2025 | 2:36 PM

తెలిసి తెలియని వయసులో పిల్లలు చేసే పనులు విచిత్రంగా ఉంటాయి. వాళ్ళు చేసే చర్యలు చూసేందుకు నవ్వు తెప్పించినా కొన్నిసార్లు అవి ప్రమాదానికి దారితీస్తుంటాయి. పెద్దల పర్యవేక్షణ లేని సమయంలో కొందరు పిల్లలు ఆడుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు మనం చాలా చూశాం. ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి.

ప్రస్తుతం ఒక బాలుడికి సంబంధించిన ఘటన వార్తల్లోకి ఎక్కింది. ఆడుకునే క్రమంలో కొత్త బిందెలో తల ఇరుక్కుపోయింది. తండ్రి తెచ్చిన కొత్త బిందే ఆ చిన్నారి ప్రాణం మీదకు తెచ్చింది. సరదాగా ఆడుకుంటూ ఉండగా మూడేళ్ల చిన్నారి తల బిందెలో ఇరుక్కుపోయింది. బిందెలో ఇరుక్కున్న తలను బయటకు తీయడం సాధ్యం కాకపోవడంతో ఊపిరి ఆగినంత పనైంది. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా కోరుకుండ గ్రామానికి చెందిన ప్రదీప్ విశ్వాస్ కొత్త బిందె కొని ఇంటికి తెచ్చాడు. నాన్న తెచ్చిన బిందెతో ఆడుతూ ఉండగా తనమయ్య తల అందులో ఇరుక్కుపోయింది. కుటుంబ సభ్యులు ప్రయత్నించినా తల బయటకు తీయలేకపోయారు. ఎవరో చెప్పగా బిందెలో ఇరుక్కున్న బాలుడిని పేరెంట్స్ మల్కాన్‌గిరి ఫైర్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఫైర్ సిబ్బంది హైడ్రాలిక్ కాంబి టూల్ ఉపయోగించారు. చాలా జాగ్రత్తగా బిందెను కట్టర్ తో తొలగించారు. ఫైర్ సిబ్బంది తమ నైపుణ్యాన్ని చూపించి చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు.

మరిన్ని వీడియోల కోసం :

అమ్మ బాబోయ్‌..! రెస్టారెంట్‌ వద్ద చుక్కలు చూపించిన ఫైథాన్‌ వీడియో

వర్షంలో మొబైల్ సిగ్నల్ రావట్లేదా? ఇలా చేసి చూడండి వీడియో

కలవరపెడుతున్న కొత్త ఇన్ఫెక్షన్.. గుర్తించకపోతే మరణమే వీడియో