గాయానికి కుట్లకు బదులు ఏకంగా ఫెవిక్విక్ రాసి చికిత్స.. కట్ చేస్తే..
ఎంత దారుణం.. ఎంత నిర్లక్ష్యం.. కర్నాటకలో ఓ స్టాఫ్ నర్సు పేషెంట్‌కు కుట్లకు బదులు ఏకంగా ఫెవిక్విక్ రాసి చికిత్స చేసింది. ఓ బాలుడి చెంపకు గాయం కావడంతో తల్లిదండ్రులు స్థానిక ప్రాథమిక చికిత్స కేంద్రానికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం అక్కడి నర్సు గాయానికి కుట్లు వేయకుండా ఫెవిక్విక్ రాసి, బ్యాండేజ్ అతికించి పంపించింది.
ఆ తర్వాత ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. ఆ నర్సు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆస్పత్రిలో ఉండే డాక్టర్లు, నర్సులను దేవుడితో సమానంగా చూస్తారు ప్రజలు. ఎందుకంటే ప్రమాదంలో ఉన్న తమకు చికిత్స చేసి కాపాడుతారు.. తగ్గిపోతుంది.. మీకేం కాదని ధైర్యం చెబుతారు. ఆ సమయంలో వారు బాధితులకు దేవుడిలాగే కనిపిస్తారు. వారు చెప్పే ఒక చిన్నమాట బాధితులకు ఎంతో ఊరటనిస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో కొందరు వైద్యులు, నర్సులు విచిత్రంగా ప్రవర్తిస్తూ వారి వృత్తికే కళంకం తెస్తున్నారు. వారి చేతలతో బాధితులను మరింత ప్రమాదంలోకి నెడుతున్నారు. అలాంటి ఘటనే కర్నాటకలో జరిగింది. హవేరీ జిల్లాకు చెందిన ఓ బాలుడి చెంపకు గాయం కావడంతో తల్లిదండ్రులు స్థానిక అడూర్ ప్రాథమిక చికిత్స కేంద్రానికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం స్టాఫ్ నర్సు జ్యోతి గాయానికి కుట్లు వేయకుండా ఫెవిక్విక్ రాసి, బ్యాండేజ్ అతికించి పంపించింది. తల్లిదండ్రులు వద్దని చెప్పినా తాను అందరికి ఇలానే చేస్తున్నట్లు చెప్పింది. కుట్లు వేస్తే మచ్చలు ఎప్పటికీ అలానే ఉండిపోతాయని వారితో వారించింది. ఈ ఘటనను వీడియో తీసిన పేరెంట్స్.. అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అడవి పంది అనుకుని వ్యక్తిపై కాల్పులు.. సీన్ కట్ చేస్తే
సంవత్సరానికి ఒకసారి మాత్రమే పూసే ఈ పువ్వు మీ ఇంట ఉంటే..
TOP 9 ET News: రూ.100 కోట్ల దిశగా తండేల్..సాధించిన చైతూ | విశ్వక్ సేన్ కొంపముంచిన పృథ్వీ మేక డైలాగ్
రూ.8 లక్షలతో స్పోర్ట్స్ బైక్.. ఇండియాలోనే తొలి కొనుగోలుదారుడిగా హీరో రికార్డ్