ఆ దేశంలో హాలీవుడ్ మూవీస్ చూస్తే కఠిన శిక్ష తప్పదు !! తల్లిదండ్రులకు ఆరునెలలు, పిల్లలకు 5 నెలలు జైలు శిక్ష

|

Mar 10, 2023 | 8:49 PM

ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ నిరంకుశ పాలన కొనసాగుతోంది. పొరుగున ఉన్న దక్షిణ కొరియా సినిమాలు, టీవీ షోలు చూస్తే ఉత్తర కొరియాలో మరణశిక్ష కూడా విధిస్తారు.

ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ నిరంకుశ పాలన కొనసాగుతోంది. పొరుగున ఉన్న దక్షిణ కొరియా సినిమాలు, టీవీ షోలు చూస్తే ఉత్తర కొరియాలో మరణశిక్ష కూడా విధిస్తారు. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు చూసినా కఠిన శిక్ష తప్పదట. పిల్లలను హాలీవుడ్ సినిమాలు చూసేందుకు అనుమతిస్తే తల్లిదండ్రులకు కఠిన శిక్షలు తప్పవని ఉత్తర కొరియా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పిల్లలు పాశ్చాత్య దేశాల సినిమాలు, టీవీ కంటెంట్ చూస్తూ దొరికిపోతే, వారి తల్లిదండ్రులను లేబర్ క్యాంపులకు పంపుతామని హెచ్చరించింది. పెద్దలు ఆరు నెలల పాటు లేబర్ క్యాంపులో ఉండాలని, పిల్లలకు ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తామని తెలిపింది. పిల్లలకు చదువు తప్ప మరొకటి ఉండకూడదని, లేకపోతే వారు పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగమైపోతారని కిమ్ ప్రభుత్వం గత కొంతకాలంగా ప్రచారం చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మద్యం మత్తులో యువకుడి వీరంగం.. ఎస్సై ని కాలితో తన్ని మరీ !!

Published on: Mar 10, 2023 08:49 PM