రూ.1.5 కోట్ల ఫ్లాట్.. పెన్సిల్‌తో గోడకు రంధ్రం ? వీడియో

Updated on: Nov 16, 2025 | 7:57 AM

ఇల్లు కొనాలంటే మాటలు కాదు. మంచి బిల్డరేనా? నాణ్యత సరిగ్గా ఉందో లేదోనని చెక్‌ చేసుకుని మరీ ఇల్లు లేదా ఫ్లాట్‌ కొనాలా లేదా అని నిర్ణయం తీసుకుంటాం. మరి కోటిన్నర రూపాయలు పెట్టి కొన్న అపార్ట్‌మెంట్ గోడ ఒక్క పెన్సిల్‌ మొనకే రంధ్రం పడితే? అలాంటి షాకింగ్ అనుభవం ఎదురైన ఓ వ్యక్తి పోస్ట్ చేసిన వీడియో నెట్టింట సంచలనంగా మారింది.

తన ప్రీమియం అపార్ట్‌మెంట్ లో కేవలం పెన్సీల్‌తో గోడకు సుత్తి సాయంతో రంధ్రం చేశానని నోయిడాకు చెందిన ఓ ఇంటి యజమాని తెలిపాడు. మొదట డ్రిల్‌ను ఉపయోగించాలని అనుకున్నాననీ కానీ డ్రిల్ అవసరం లేకుండానే, పెన్సిల్‌ నేరుగా గోడలోకి దిగిపోయిందనీ, ఇది మనం స్కూల్లో వాడే గ్రాఫైట్‌ పెన్సిలేననీ ఈ ఇల్లు ఎంతో బలంగా ఉంది కదూ అంటూ వ్యంగ్యంగా పోస్ట్‌లో రాసుకొచ్చాడు. దీనిపై చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోయారు. దీంతో ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలోని ఖరీదైన గృహనిర్మాణ ప్రాజెక్టులలో నాణ్యత డొల్ల అనే అంశంపై నెట్టింట చర్చ మొదలైంది. కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోవడం బాధాకరం అంటూ వాపోయారు. మరికొందరు నిర్మాణంలోని మరో కోణాన్ని బయటపెట్టారు. అవి ఆటోక్లేవ్డ్ ఎరేటెడ్ కాంక్రీట్ గోడలు అని, AAC అంటారనీ, ఈ తేలికైన గోడలను ఎత్తైన నిర్మాణాలలో ఉపయోగిస్తారని, భూకంపాల సమయంలో సురక్షితంగా, మరింత స్థిరంగా ఉంటాయని అన్నారు. ఈ గోడలు భారాన్ని మోస్తాయి. సాంప్రదాయ ఇటుక, మోర్టార్ గోడల మాదిరిగా ఉండవని వివరణ ఇచ్చారు.

మరిన్ని వీడియోల కోసం :

మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో

మీ బ్యాంక్‌ ఎకౌంట్‌ భద్రమేనా? వీడియో

మోడల్‌ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో