మెస్సీ కోసం హనీమూన్ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్ వీడియో
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ కోల్‌కతా పర్యటనలో ఓ కొత్త పెళ్లికూతురు అందరి దృష్టిని ఆకర్షించింది. తన హనీమూన్‌ను వాయిదా వేసుకుని మెస్సీని చూసేందుకు వచ్చిన ఆమె, జస్ట్ మ్యారీడ్, హనీమూన్ క్యాన్సిల్ చేసుకున్నాం అని రాసి ఉన్న ప్లకార్డు ప్రదర్శించింది. అయితే, మెస్సీ ఆడకుండానే వెళ్లిపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ తన ఇండియా టూర్‌లో భాగంగా కోల్‌కతాకు వచ్చారు. తమ అభిమాన ఆటగాడిని చూసేందుకు వేలాది మంది అభిమానులు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా, ఒక కొత్త పెళ్లికూతురు ప్రదర్శించిన ప్లకార్డ్ అందరి దృష్టిని ఆకర్షించింది. డిసెంబర్ 5న వివాహం జరిగి, హనీమూన్‌కు వెళ్లాల్సిన ఆమె, మెస్సీ వస్తున్నాడన్న విషయం తెలిసి తన హనీమూన్‌ను వాయిదా వేసుకుంది. “జస్ట్ మ్యారీడ్, మెస్సీని చూసేందుకు హనీమూన్‌ను క్యాన్సిల్ చేసుకున్నాం” అని ఆ ప్లకార్డులో రాసి ఉంది. 2010 నుంచి తాను మెస్సీకి పెద్ద ఫ్యాన్‌నని ఆమె మీడియాకు తెలిపింది.
