సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
ఒకప్పుడు కొత్త సంవత్సరం అంటే నెల రోజుల ముందు నుంచే గ్రీటింగ్ కార్డ్‌లు, డైరీల సందడి. పిల్లల నుండి పెద్దల వరకు ఉత్సాహంగా కొనేవారు. అయితే, గత 25-30 ఏళ్లుగా సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్‌ల రాకతో ఈ సంస్కృతి పూర్తిగా అంతరించిపోయింది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో శుభాకాంక్షలు మార్చుకుంటూ, గ్రీటింగ్‌ల వ్యాపారం లేదని వ్యాపారులు వాపోతున్నారు.
ఒకప్పుడు న్యూ ఇయర్ వస్తుందంటే చిన్నపిల్లలనుంచి పెద్దలవరకూ నెల రోజులముందునుంచే హడావిడి చేసేవారు. గ్రీటింగ్ కార్డ్స్ కోసం స్టేషనరీ షాపులకు పరుగెత్తేవారు. అంతేకాదు ప్రత్యేకంగా స్టాల్స్ వేసి మరీ గ్రీటింగ్స్ అమ్మేవారు. తమ అభిమాన హీరోలు, నచ్చిన దేవుళ్లు, పూలు రకరకాల గ్రీటింగ్ కార్డ్స్ దుకాణాల్లో కొలువుదీరి అందరినీ ఎంతగానో ఆకర్షించేవి. ప్రస్తుత కాలంలో గ్రీటింగ్ కార్డ్స్ పూర్తిగా అంతరించిపోయాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అందరూ వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌లో గ్రీటింగ్స్ చెప్పుకుంటున్నారు. ప్రత్యేకించి కార్డ్స్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పే కాలం పూర్తిగా కనుమరుగైపోయింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో .. కొత్త ఏడాది వస్తుందంటే నెల రోజుల నుండే ప్రత్యేక స్కాల్స్ ఏర్పాటు చేసి గ్రీటింగ్స్ డైరీలు అమ్మేవారు. స్కూల్ పిల్లల దగ్గర నుండి టీచర్స్ ,ఉద్యోగులు అందరూ కూడా గ్రీటింగ్స్ డైరీలు కొనేందుకు ఎగబడేవారు. ఫ్రెండ్స్ కి కావలసిన వాళ్ళకి టీచర్స్ కి పై స్థాయి ఉద్యోగులకి గ్రీటింగ్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి ఎంతో ఆనందంగా జరుపుకునే న్యూ ఇయర్ వేడుక ఇప్పుడు కనుమరుగైపోయింది. ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని సెల్ ఫోన్ లో శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు. ఒకప్పుడు న్యూ ఇయర్ వేళ కొత్త బట్టలు వేసుకుని గ్రీటింగ్ పట్టుకుని ఇంటికి వెళ్లి గ్రీటింగ్ కార్డు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పి ఎంతో ఆనందంగా న్యూఇయర్ జరుపుకునేవారు. అయితే గడిచిన 25,30 సంవత్సరాలుగా ఈ కల్చర్ మారిపోయింది . ఎప్పుడైతే ఆండ్రాయిడ్ టచ్ మొబైల్స్ అందుబాటులోకి వచ్చాయో గ్రీటింగ్స్, డైరీల కల్చర్ తగ్గుతూ వస్తూ ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయింది. పిల్లలు పెద్దలు ఉద్యోగులు అందరూ కూడా సెల్ఫోన్లోనే విషెస్ చెబుతూ సరిపెడుతున్నారు. అయితే కొన్నేళ్ల క్రితం గ్రీటింగ్స్ డైరీల వ్యాపారం పెద్ద ఎత్తున జరిగేదని ఇప్పుడు ఎవరు కూడా ఒక్క గ్రీటింగ్ కూడా కొనే పరిస్థితి లేదని వాపోతున్నారు వ్యాపారులు. న్యూ ఇయర్ వస్తుందంటే నెల రోజుల ముందు నుంచి బెంగళూరు ముంబై చెన్నై వంటి నగరాల నుంచి ప్రత్యేకంగా గ్రీటింగ్స్ రప్పించి వ్యాపారాలు చేసేవాళ్ళమని, ప్రజలు వాళ్లకు నచ్చిన గ్రీటింగ్స్ తీసుకుని వెళ్లేవారని అలాగే ముఖ్యమైన వాళ్లకు ఒక డైరీ ఒక పెన్ తీసుకువెళ్లేవారని చెబుతున్నారు. ఎప్పుడైతే మొబైల్ ఫోన్స్ వాట్సప్ ఇన్స్టాగ్రాఫ్ ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వచ్చిన తరువాత వీటి వంక చూడడం మానేశారు అంటున్నారు వ్యాపారులు. గ్రీటింగ్ కల్చర్ డైరీ కల్చర్ కూడా ఒక చరిత్రగా మిగిలిపోయిందంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోమాలో ఆసీస్ బ్యాటర్.. ఆరోగ్య పరిస్థితి విషమం
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
