Newly Married Couple Video: పెళ్లి వేదికపైనే నవ దంపతుల నిరసన..అంతా షాక్‌..! వైరల్ అవుతున్న వీడియో..

Updated on: Nov 15, 2021 | 9:21 AM

వివాహ వేడుకంటేనే... హంగులు, ఆర్భాటాలు, విందులు, చిందులతో సందడి సందడిగా ఉంటుంది...ఇక పెళ్లి చేసుకునే నవదంపతులు బిజీ బిజీగా, ఫుల్లు జోష్‌లో ఉంటారు. కానీ, ఇక్కడో జంట మాత్రం పెళ్లిమండపాన్ని నిరసన వేదికగా మార్చేసింది.


వివాహ వేడుకంటేనే… హంగులు, ఆర్భాటాలు, విందులు, చిందులతో సందడి సందడిగా ఉంటుంది…ఇక పెళ్లి చేసుకునే నవదంపతులు బిజీ బిజీగా, ఫుల్లు జోష్‌లో ఉంటారు. కానీ, ఇక్కడో జంట మాత్రం పెళ్లిమండపాన్ని నిరసన వేదికగా మార్చేసింది. వాళ్ల నిరసనకు కారణం తెలిశాఖ పెళ్లికి వచ్చిన వారంతా శభాష్‌ అంటూ ప్రశంసలు కురిపించారు..ఇంతకీ వాళ్ల నిరసనకు కారణం ఏంటో చెప్పనే లేదు కదా..అక్కడికే వస్తున్నాం…

పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించిన నవ జంట.. ప్రభుత్వానికి తమ నిరసనను ఇలా వినూత్న రీతిలో వెల్లడించారు. మహారాష్ట్రలోని థానేలో జరిగిన వివాహ వేడుకలో నవ దంపతులు పర్యావరణ పరిరక్షణకై సరికొత్త రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, విహార్ సరస్సు, పోవై సరస్సులను బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సైకిల్ ట్రాక్ ప్రాజెక్టు నుంచి రక్షించడానికి తమ వంతు కృషి చేశారు. పెళ్లి దుస్తుల్లోనే ఉన్న రెండు జంటలు.. ప్లకార్డులు పట్టుకుని ‘సేవ్ విహార్ లేక్’ అని ప్రదర్శించారు.

మా భవిష్యత్తు ప్రమాదంలో ఉంది, దయచేసి మా పొవై సరస్సు, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌ని ఆక్రమించొద్దు… అని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనం పరిసరాల్లో సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సదరు ఉద్యాన వనంలో కొంతభాగం చెట్లు తొలగించాల్సి వస్తుంది. దీన్ని పర్యావరణ ప్రేమికులు తీవ్రంగా నిరసిస్తున్నారు. ఇదొక విధ్వంసక ప్రాజెక్టు అంటూ ఫైర్ అవుతున్నారు. జీవావరణానికి ప్రమాదం కలిగించే చర్యలే తప్ప.. మరోటి కాదని అంటున్నారు పర్యావరణ ప్రేమికులు. కాగా, ఎవరెంతగా వ్యతిరేకిస్తున్నప్పటికీ.. అధికారులు తమ పనిని తాము చేసుకుంటూ పోతున్నారు. నేషనల్ పార్క్ లోపల, విహార సరస్సు పరిసరాల్లో సైకిల్ ట్రాక్ పనులను కొనసాగిస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…

Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…

Published on: Nov 15, 2021 09:10 AM