Viral Video: ఈ స్పైడర్‌ ఉమెన్‌ను చూశారా.? ప్రాణాలు పణంగా పెట్టి మరీ.. 4వ అంతస్తులో కిటికి శుభ్రం చేస్తూ..

Viral Video: కొందరు మరీ చాదస్తంగా ఉంటారు. శుభ్రతా, పరిశుభ్రత అంటూ కడిగినవే కడుగుతుంటారు.. తుడిచినవే తూడుస్తుంటారు. అయితే ఈ అలవాటు ఓ స్థాయి వరకు ఉంటే బాగానే ఉంటుంది. కానీ మితి మీరితేనే లేనిపోని సమస్యలు వస్తాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో...

Viral Video: ఈ స్పైడర్‌ ఉమెన్‌ను చూశారా.? ప్రాణాలు పణంగా పెట్టి మరీ.. 4వ అంతస్తులో కిటికి శుభ్రం చేస్తూ..
Viral Video

Updated on: Feb 22, 2022 | 1:12 PM

Viral Video: కొందరు మరీ చాదస్తంగా ఉంటారు. శుభ్రతా, పరిశుభ్రత అంటూ కడిగినవే కడుగుతుంటారు.. తుడిచినవే తూడుస్తుంటారు. అయితే ఈ అలవాటు ఓ స్థాయి వరకు ఉంటే బాగానే ఉంటుంది. కానీ మితి మీరితేనే లేనిపోని సమస్యలు వస్తాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో ఇదే విషయాన్ని చెబుతోంది. అతి ఏదైనా అనర్థాలకే దారి తీస్తుందన్న విషయానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోందీ వీడియో. ఇంట్లో కిటికి శుభ్రం చేయడానికి ఓ మహిళ చేసిన సాహసం, నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. ఆ మహిళ చేసిన పనికి నెటిజన్లు కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. గజియాబాద్‌లో శిప్రా రివేరా సొసైటీలోని నాల్గవ అంతస్తులోని అపార్ట్‌మెంట్‌లో ఓ మహిళా నివాసం ఉంటుంది. ఈ క్రమంలోనే ఫ్లాట్‌కు వెనకాల ఉన్న కిటికి అద్దాలను శుభ్రం చేయాలనుకుందా మహిళ. సాధారణంగా ఎవరైనా ఏదైనా కర్రతోనో, మరో క్లీనింగ్‌ పరికరంతో శుభ్రం చేస్తారు. కానీ ఆ మహిళ మాత్రం స్పైడర్‌ ఉమెన్‌లా మారిపోయింది. కిటికి ముందు ఉండే ఆ కాసింత స్థలంలోనే నిలబడి ఎంచక్కా కిటికిని శుభ్రం చేసింది. ఈ సమయంలోనే ఆ మహిళ నివాసం ఉంటున్న ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లోని మరో మహిళ ఈ విషయాన్ని గమనించారు.

అలా చేయడం ప్రమాదకరమని చెప్పడానికి ఎంత పిలిచినా స్పందించలేదా ఆ మహిళ. దీంతో ఆమె తన కూతురును కిటికి క్లీనింగ్‌ చేస్తున్న ఫ్లాట్‌కు పంపించి ఆమెను లోపలికి రప్పించారు. ఇదే సమయంలో మహిళ కిటికి శుభ్రం చేస్తున్నదంతా స్మార్ట్‌ ఫోన్‌లో బంధించారు. ఈ వీడియోను కాస్త సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది. కిటికి శుభ్రం చేయడానికి ప్రాణాలు పణంగా పెట్టడం అవసరమా.? అంటూ నెటిజన్లు కాసింత ఘూటాగానే స్పందిస్తున్నారు. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Relationship: కొత్తగా పెళ్లైన జంటలు ఈ 4 విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.. అవేంటంటే..?

JIO: జియో ఈ 4 ప్లాన్‌లలో జంబో డేటా ఆఫర్.. ధరలు ఏ విధంగా ఉన్నాయంటే..?

యానిమల్‌ ప్లానెట్‌ ప్రతినిధిపై మొసలి దాడి.. ఆస్ట్రేలియాలో షాకింగ్‌ ఘటన.. వీడియో