Neeraj Chopra: అభిమాని పాదాలకు నమస్కరించిన నీరజ్‌ చోప్రా.. చేసే పనులోనే సంస్కారం కనిపిస్తుంది..

|

Jul 03, 2022 | 4:41 PM

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని పెద్దలు చెబుతుంటారు. అది అక్షరాలా పాటిస్తున్నాడు ప్రపంచ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌ ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా. నీరజ్‌ ఒలింపిక్స్‌లో భారతదేశానికి..


ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని పెద్దలు చెబుతుంటారు. అది అక్షరాలా పాటిస్తున్నాడు ప్రపంచ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌ ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా. నీరజ్‌ ఒలింపిక్స్‌లో భారతదేశానికి మొట్టమొదటి బంగారు పతకం సాధించిన ఆటగాడు. అంతర్జాతీయంగా నీరజ్‌ రెండో స్థానంలో ఉన్నారు. అంతేకాదు నీరజ్‌ భారత సైన్యంలో జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. ఇంతటి ఉన్నత స్థితిలో ఉన్నా అతని సత్ప్రవర్తన నెటిజన్ల మనసు దోచుకుంటోంది. అభిమానులను తాను ఎంతగా గౌరవిస్తారో… పెద్దల పట్ల అతనికున్న మర్యాద ఎలాంటిదో ఈ వీడియో కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఈ వీడియోను ‘యువ‌ర్’ అనే యూజ‌ర్ తన ట్విట‌ర్‌ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో నీరజ్ చోప్రా తన అభిమానులతో కలిసి ఫోటోలు దిగుతున్నారు. తనను చూసేందుకు వచ్చిన అభిమానులందరితో ఎంతో మర్యాదగా కరచాలనం చేస్తూ.. అంద‌రికీ ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు.. ఆ అభిమానుల్లో ఉన్న ఓ పెద్దాయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అది.. నీరజ్‌ చోప్రా అంటే.. ఆకాశమంత ఎత్తు ఎదిగినా తానుండేది భూమ్మీదేనని నిరూపించారు నీరజ్‌ చోప్రా. ఈ వీడియో నెటిజ‌న్లను ఎంతగానో ఆక‌ట్టుకుంటుంది. వేలమంది ఈ వీడియోను వీక్షిస్తూ.. నీర‌జ్ చోప్రా.. డౌన్ టు ఎర్త్ వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Follow us on