Nanjiyamma: గిరిజన మహిళ నాంజియమ్మకు.. “అయ్యప్పనుమ్ ”లో పాటకు నేషనల్‌ అవార్డు..

|

Jul 27, 2022 | 7:05 AM

అయ్యప్పనుమ్ కోషియుమ్‌ చిత్రంలో ‘కళకాత్తా సందనమేరే’.. పాటకు నేషనల్‌ అవార్డుకు ఎంపికైన నాంజియమ్మ 60 ఏళ్ళ గిరిజన మహిళ. ఈ పాట నంజియమ్మ జీవితానికి ముడిపడిన పాట.


అయ్యప్పనుమ్ కోషియుమ్‌ చిత్రంలో ‘కళకాత్తా సందనమేరే’.. పాటకు నేషనల్‌ అవార్డుకు ఎంపికైన నాంజియమ్మ 60 ఏళ్ళ గిరిజన మహిళ. ఈ పాట నంజియమ్మ జీవితానికి ముడిపడిన పాట. అలాంటిది ఒక్క సినిమాతోనే ఇవాళ దేశం ఆమె గురించి మాట్లాడుకునే స్థాయికి ఎదిగింది. పలక్కడ్‌ జిల్లా అట్టపడి.. కేరళలో ఉన్న ఏకైక గిరిజన ప్రాంతం. ఇరుల గిరిజన తెగకు చెందిన ఈమె జానపద కళాకారిని. ప్రకృతిని నమ్ముకున్న నాంజియమ్మ.. చెట్టు, గట్టు, పుట్ట, పశువులను చూస్తూనే అలవోకగా పాటలు పాడుతుంది. గిరిజన కళాకారుల సంఘం ఆట కళాసంఘం, ఆజాద్‌ కళా సమితిలో ఆమె సభ్యురాలు కూడా. పళని స్వామి ఆజాద్‌ కళా సమితి వ్యవస్థాపకుడు. ఈయన ద్వారానే నాంజియమ్మ గురించి తెలుసుకున్న దర్శకుడు సాచీ.. పాడేందుకు ఒక అవకాశం ఇచ్చాడు. సినిమాలో టైటిల్‌ ట్రాక్‌ తో సహా మూడు పాటలు ఆమె పాడారు. అంతేకాదు.. చిత్రంలో ప్రధాన పాత్రధారి అయ్యప్పన్‌ క్యారెక్టర్‌కి అత్త క్యారెక్టర్‌లోనూ మెరిశారు ఆమె. సంగీత దర్శకుడు జేక్స్‌ బిజోయ్‌‌.. రికార్డింగ్‌ సమయంలో నాంజియమ్మకు ఎంతో సహకారం అందించాడు. పరాయి, దావిల్, కోకల్, జల్త్రా వంటి సాంప్రదాయ గిరిజన వాయిద్యాలను పాటలో ఉపయోగించాడు. ఈ పాట యూట్యూబ్‌లో రిలీజ్‌ అయిన నెల రోజులకే 10 మిలియన్ల వ్యూస్‌ దక్కించుకుంది. మలయాళీలకు మాత్రమే కాదు.. సౌత్‌ చిత్రాలకు ఆదరించే ఎందరికో ఇదొక ఫేవరెట్‌ సాంగ్‌. అటవీ భూముల్లోని గంధపుచెట్లు, పువ్వులు, వృక్షజాలాన్ని వివరిస్తుంది ఈ పాట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..

Bus Shelter – Buffalo: బస్‌ షెల్టర్‌ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..

Published on: Jul 27, 2022 07:05 AM