ఆయన తలపై గురిపెట్టుకున్న గన్స్‌ వేలం.. రూ. 15 కోట్లకు కొనుక్కున్న అజ్ఞాత వాసి

|

Jul 12, 2024 | 6:49 PM

ఫ్రాన్స్ చరిత్రపై బలమైన ముద్రవేసిన సైన్యాధ్యక్షుడు, రాజకీయ నాయకుడు ‘నెపోలియన్ బోనపార్టే’.. ఒకప్పుడు తాను ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించాలని భావించిన రెండు పిస్తోళ్లను వేలం వేయగా భారీ ధర పలికాయి. ఫ్రాన్స్‌లో నిర్వహించిన వేలంలో ఈ రెండు పిస్తోళ్లను సుమారు 15 కోట్ల రూపాయలకు విక్రయించినట్లు వేలం నిర్వహణ సంస్థ ‘ఒసేనాట్ ఆక్షన్’ తెలిపింది. అయితే కొనుగోలు చేసినవారి పేర్లను మాత్రం గోప్యంగా ఉంచింది.

ఫ్రాన్స్ చరిత్రపై బలమైన ముద్రవేసిన సైన్యాధ్యక్షుడు, రాజకీయ నాయకుడు ‘నెపోలియన్ బోనపార్టే’.. ఒకప్పుడు తాను ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించాలని భావించిన రెండు పిస్తోళ్లను వేలం వేయగా భారీ ధర పలికాయి. ఫ్రాన్స్‌లో నిర్వహించిన వేలంలో ఈ రెండు పిస్తోళ్లను సుమారు 15 కోట్ల రూపాయలకు విక్రయించినట్లు వేలం నిర్వహణ సంస్థ ‘ఒసేనాట్ ఆక్షన్’ తెలిపింది. అయితే కొనుగోలు చేసినవారి పేర్లను మాత్రం గోప్యంగా ఉంచింది. పారిస్‌లోని ఫాంటైన్‌బ్లూలో వేలాన్ని ఆదివారం నిర్వహించారు. కాగా ఈ పిస్తోళ్లను వేలం వేయడానికి ముందు రోజు వీటిని దేశ సంపదగా ఫ్రాన్స్ ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ కమిషన్ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ వస్తువులను జాతీయ సంపదగా వర్గీకరించామని, వాటి విక్రయంపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో వేలం పాటలో దక్కించుకున్న వ్యక్తుల నుంచి ఈ పిస్తోళ్లను ఫ్రాన్స్ ప్రభుత్వం తిరిగి దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సుధీర్ బాబుకు బిగ్ ఝలక్.. ప్రాబ్లం ఏమై ఉంటుంది ??

SSMB29: మహేష్ బాబు – రాజమౌళి సినిమాకు.. ఆషాఢం ఎఫెక్ట్..

శుచీ శుభ్రం లేని స్టార్ హీరో రెస్టారెంట్‌.. సీరియస్‌గా రియాక్టైన సందీప్‌ కిషన్

Ram Charan: 7.5 కోట్ల ఎలక్ట్రిక్ కార్.. చరణ్‌ తో మామూలుగా ఉండదు మరి