ముంబయిలోని మాహిమ్ ప్రాంతంలో నౌషాద్ అనే వ్యక్తి ఎంఎన్‌సీలో ఉద్యోగాన్ని వదిలి ‘ది పాన్ స్టోరీ’ పేరుతో పాన్ షాపు నిర్వహిస్తున్నారు. వివిధ రకాల రుచుల్లో పాన్‌లను తయారు చేసి విక్రయిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ముంబైలో ఆయన పాన్‌కు మంచి పేరుంది.. పేరుతో పాటే మంచి రేటు కూడా ఉందండోయి.. పాన్ తినాలంటే నౌషాద్ భయ్యా చేతిపానే తినాలంటారు పాన్ ప్రియులు. ఈక్రమంలో నౌషాద్ తనదైన స్టైల్ లో ఓ పాన్ తయారు చేశారు. దానికి ‘తాజ్‌మహల్ పాన్’ అని పేరు పెట్టారు. ప్రేమకు ప్రతీకైన తాజ్‌మహల్‌కు తన స్పెషల్ పాన్‌ను జోడిస్తే ఆ అనుభూతే వేరు అంటున్నారు నౌషాద్. అందులో రెండు అత్తరు సీసాలను కానుకగా జత చేశాడు. ప్రేమకుక చిహ్నమైన తాజ్ మహల్ పాన్ ను ఎవరికైనా గిఫ్టుగా ఇస్తే జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండేలా దీన్ని తయారు చేసానంటున్నారు నౌషాద్. ఇలాంటి ప్రీమియం పాన్‌లను విక్రయించడం నౌషాద్కు కొత్తేం కాదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: NTR అలా.. చరణ్ ఇలా.. ఎవరు చెప్పింది నిజం! | నోరు జారిన ఆస్కార్ యాంకర్