ఛీ.. శవం చేతి బంగారు కడియాన్నివదలని హాస్పిటల్ సిబ్బంది

Updated on: Oct 25, 2025 | 10:56 AM

ముంబై ఆస్పత్రిలో అడ్మిట్ అయిన ఓ పేషెంట్ బంగారాన్ని.. ఆయన చనిపోయిన తర్వాత ఆస్పత్రి సిబ్బంది దొంగిలించారని మృతుడి కుమార్తెలు ఆరోపించారు. ఎన్నిసార్లు అడిగినా బంగారం తిరిగి ఇవ్వడం లేదని చెప్పారు. చివరకు సోషల్ మీడియాలో తమ గోడు వెళ్లబోసుకున్నారు. విట్టల్‌ శెట్టికి అక్టోబర్ 16న గుండెపోటు వచ్చింది.

దీంతో ఆయన్ను ఎమ్‌జీఎమ్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూనే ప్రాణాలు కోల్పోయారు. విట్టల్‌ ఎప్పుడూ ఒక బంగారు కడియం ధరించేవారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ కడియం కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన అతని కూతుళ్లు ఆస్పత్రికి సిబ్బంది అడిగారు. వారు మృతుడికి చెందిన అన్ని వస్తువులు అప్పగించారు కానీ బంగారు కడియం మాత్రం ఇవ్వలేదు. తమ నాయనమ్మ మరణం తర్వాత.. ఆమె మంగళసూత్రం తాలూకూ బంగారంతో .. తమ తండ్రి బంగారు కడియాన్ని చేయించుకున్నారని, అది తమకు ఎంతో వెలకట్టలేనిదని వారు విట్టల్ కుమార్తెలు గీతిక, పరిణి వాపోయారు. తండ్రి చనిపోయిన రోజే.. తాము ఆ కడియం తిరిగివ్వాలని అడిగితే అది స్టీల్‌ కడియం అని ఆసుపత్రి సిబ్బంది వాదించారని, కాసేపటి తర్వాత అసలు దానిని తాము చూడనే లేదని తప్పించుకున్నారని విట్టల్ కుటుంబం వెల్లడించింది. ఆ తర్వాత కూడా ఎన్నిసార్లు కడియం గురించి ఈమెయిల్స్, కాల్స్ చేసినా ఆస్పత్రి నుంచి స్పందన లేదని తెలిపారు. చివరికి చేసేదేమి లేక ఇన్‌స్టాగ్రామ్‌లో జరిగిందంతా వివరిస్తూ పోస్టు పెట్టారు బాధితుడి కూతుళ్లు. తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అది కేవలం బంగారం కడియం మాత్రమే కాదని తమ తండ్రి గుర్తు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాధితులకు న్యాయం జరగాలని వేలాది మంది నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. ముంబై, నవీముంబై, ఎమ్‌జీఎమ్ ఆసుపత్రికి ట్యాగ్ చేస్తూ కామెంట్లు చేశారు. కాగా, సదరు ఆసుపత్రిపై సోషల్ మీడియాలో యూజర్లు మండిపడ్డారు. ఒకరి మరణాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకోవడం సిగ్గుచేటపి ఓ యూజర్ డిమాండ్ చేశాడు. మరో నెటిజన్ స్పందిస్తూ ప్రియమైన వారిని కోల్పోవడమే చాలా బాధాకరం అంటే అలాంటి వాళ్లకు సంబంధించిన తీపి జ్ఞాపకాల కోసం పోరాడటం మరీ దారుణమన్నాడు. ముంబై పోలీసులే బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ లేడీ జేమ్స్ బాండ్’రూటే సపరేటు

రైలు నుంచి పడి భర్త మృతి.. 23 ఏళ్ల తర్వాత ఆమెకు పరిహారం

టీవీ9 పరిశీలనలో బయటపడిన ట్రావెల్స్‌ నిర్లక్ష్యం

కామాంధుడికి 32 ఏళ్ల జైలు శిక్ష..

ఉద్యోగులకు అమెజాన్ ఊహించని షాక్.. 5 లక్షల మంది ఔట్