ఆటోలో దూసుకెళ్తున్న డ్రైవర్‌.. వెనుక సీటులో ఉన్నది చూసి..

Updated on: Nov 14, 2025 | 1:36 PM

ముంబైలో రూ.16 లక్షల విలువైన బంగారు నగలు పోగొట్టుకున్న ప్రయాణికులకు ఆటో డ్రైవర్ సంతోష్ శిర్కే నిజాయితీ చాటాడు. తన ఆటోలో మరిచిపోయిన బ్యాగ్‌లోని బంగారాన్ని గుర్తించి, యూనియన్ సహకారంతో పోలీసులకు అప్పగించాడు. నిరాశలో ఉన్న యజమానులకు నగలు తిరిగి దక్కాయి. ప్రతిఫలం తిరస్కరించిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు సన్మానించారు, ఆయన నిజాయితీని ప్రశంసించారు.

ఓవైపు బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యులు బంగారం కొనాలనే ఆలోచన చేయడానికి కూడా సాహసించడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో లక్షల విలువైన బంగారం సామాన్యులెవరికైనా దొరికితే.. ఒక్కసారి ఊహించుకోండి..పండగచేసుకుంటారు కదా.. కానీ కొందరు మాత్రం అయ్యో.. ఎంతకష్టపడి కొనుక్కున్నారో ఏమోనని తమకు దొరికిన బంగారాన్ని తిరిగి వారికి సేఫ్‌గా అప్పగిస్తుంటారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. తాజాగా ముంబైలో మరో ఘటన చోటుచేసుకుంది. తన ఆటోలో బంగారు నగల బ్యాగ్‌ చూసి షాకైన ఆటోడ్రైవర్‌ తన యూనియన్‌ ద్వారా పోలీసులకు అప్పగించాడు. ముంబైకి చెందిన ఓ ఆటో డ్రైవర్ తన ఆటోలో ప్రయాణించిన ప్రయాణికులు నగల బ్యాగ్‌ మరిచిపోయి వెళ్లిపోతే..నిజాయతీగా నగలను యజమాని చెంతకు చేర్చాడు. పోయాయని అనుకుని నిరాశలో మునిగిపోయిన సదరు ప్రయాణికులు 16 లక్షల విలువైన నగలు తిరిగి దక్కిన సంతోషంలో మునిగిపోయారు. మనసులోనే దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ.. ఆటో డ్రైవర్‌ నిజాయితీకి మెచ్చి అతనికి కొంత నగదు ఇవ్వబోయారు. అయితే ఆటోడ్రైవర్‌ సున్నితంగా దానిని తిరస్కరించారు. బాధ్యత కలిగిన పౌరుడిగా తన విధి తాను నిర్వర్తించానని, దానికి ప్రతిఫలం ఆశించనని చెప్పడంతో పోలీసులు ఆ ఆటో డ్రైవర్ ను సన్మానించారు. నవీ ముంబైలోని వాషికి చెందిన ఓ మహిళ కాశీ యాత్రకు వెళ్లి తిరిగొచ్చారు. వాషి రైల్వే స్టేషన్ లో దిగిన ఆమెను తీసుకెళ్లడానికి ఆమె కొడుకు మోతిలగ్ స్టేషన్ కు వచ్చాడు. ఇద్దరూ కలిసి ఆటోలో ఇంటికి చేరుకున్నారు. వాళ్లను దింపేసి డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయిన ఆటో డ్రైవర్ సంతోష్ శిర్కే.. చాలా సేపటికి వెనక సీట్లో ఉన్న బ్యాగును గుర్తించాడు. అందులో ఏముందని తెరచి చూడగా బంగారు నగలు కనిపించాయి. ఆ బ్యాగును ఆటో యూనియన్ కార్యాలయంలో అప్పగించాడు. అప్పటికే నగల బ్యాగు ఆటోలో మర్చిపోయిన విషయాన్ని మోతిలగ్ తన స్నేహితుడైన మరో ఆటో డ్రైవర్ కు చెప్పగా.. సదరు ఆటో డ్రైవర్ తమ యూనియన్ వాట్సాప్ గ్రూప్ లో విషయం పోస్ట్ చేశాడు. నగల బ్యాగు ఆటో యూనియన్ కార్యాలయంలో ఉందని, వాషి పోలీస్ స్టేషన్ కు రావాలని వారికి సమాచారం ఇచ్చిన సంతోష్.. ఆటో యూనియన్ సభ్యులతో కలిసి నగల బ్యాగును వాషి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. అనంతరం ఏపీఐ సమక్షంలో.. నగల వివరాలను సరిచూసుకుని బ్యాగును మోతిలగ్ కు అప్పగించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బియ్యం ధర గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్‌.. తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే

ఆధార్‌ వినియోగదారులకు మరో గుడ్‌ న్యూస్‌

ఇకపై విమానాలకు ఇంధనంగా వంటనూనె !!

వేల కోట్ల వ్యాపారాలకు వారసుడు.. అయినా రాత్రిళ్లు క్యాబ్ నడుపుతూ

రెండు చేతులూ లేకపోయినా బైక్‌పై దూసుకెళ్లిన..