నడిచి వెళ్లి చెట్లు ఎక్కే చేపను చూశారా ?? పరిశోధకులను ఆశ్చర్యపరుస్తున్న వింత

Updated on: Oct 01, 2025 | 4:52 PM

చేపల గురించి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సాధారణంగా అవి నీటిలోనే జీవిస్తాయని. చేపలు ఒకసారి నీటి నుంచి బయటకు వచ్చాయంటే.. ప్రాణాలు కోల్పోవడం ఖాయం. కానీ, భూమిపై నడుస్తూ, గాల్లో ఎగురుకుంటూ వెళ్లే చేప జాతి ఒకటి ఉందని మనలో చాలామందికి తెలీదు. అంతే కాదు..ఈ జాతి చేపలు.. చెట్లను కూడా అవలీలగా ఎక్కేస్తాయి.

ప్రకృతి వైవిధ్యాల్లో మరో వింతగా నిలుస్తున్న ఈ చేపనే.. మడ్ స్కిప్పర్ అంటారు. ఎన్నో విశేషాలున్న ఈ చేప.. ఇప్పుడు పరిశోధకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది గోబియిడే కుటుంబానికి చెందిన చేప. చేపలు సాధారణంగా గిల్ల్స్ ద్వారా మాత్రమే శ్వాసిస్తాయి. కానీ మడ్ స్కిప్పర్స్‌ చర్మం ద్వారా, నోరు, గొంతు లైనింగ్ ద్వారా కూడా ఆక్సిజన్ గ్రహిస్తాయి. ఈ ప్రక్రియను ‘కటేనియస్ రెస్పిరేషన్’ అంటారు. దీనివల్లే ఇది నీటి బయట కూడా చాలాసేపు బతకగలుగుతుంది. సాధారణ చేపలకు భిన్నంగా మడ్ స్కిప్పర్స్‌ కు బలమైన పెక్టోరల్ రెక్కలు ఉంటాయి. ఇవి దాదాపు కాళ్లలాగా పనిచేస్తాయి. నేలపై నడవడానికి, గాల్లో ఎగరడానికి, చెట్లను ఎక్కడానికి వీటివల్లే సాధ్యం అవుతుంది. సముద్ర తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా బురద నేలలో ఇవి రెండు రోజుల పాటు జీవించగలవు. మడ్ స్కిప్పర్స్ కళ్లు చాలా పెద్దగా ఉంటాయి. అంతేకాకుండా ఈ కళ్లు ఒకదానికొకటి వేరే వేరే దిశల్లో తిరగగలవు. తలపై ఉబ్బెత్తుగా ఉండే ఈ కళ్లతోనే ఇవి నీటి ఉపరితలంపై ఉండే.. చిన్న కీటకాలను, చిన్న చేపలు, రొయ్యలు, కీటకాల వంటి చిన్న జీవులను టక్కున ఎగిరి ఇట్టే పట్టేసుకుని తినేస్తాయి. అదే సమయంలో.. తమను వేటాడే జంతువుల నుంచి తప్పించుకునేందుకు.. చుట్టూ ఓ కన్నేసి ఉంటూ.. వాటి బారినుంచి తమను తాము కాపాడుకుంటాయి. మగ చేపలు తమ ఆధిపత్యాన్ని చూపించడానికి పుష్-అప్‌లు చేస్తాయి. రెక్కలను ప్రదర్శించి శత్రువులను భయపెడతాయి. ఇవి బురదలో లోతైన బొరియలు తవ్వి గుడ్లు పెడతాయి. మగ చేపలు బొరియలను కాపాడుతూ గుడ్లను రక్షిస్తాయి. పర్యావరణానికి అనుగుణంగా మారిన ఈ ప్రత్యేక చేపలు సముద్ర తీర ప్రాంతాల్లో పరిశోధనకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తండ్రీ కొడుకుల ప్రాణం తీసిన ఇంటి గోడ

ఆ కీచక తండ్రికి చచ్చే వరకు జైలు శిక్ష.. పోక్సో కేసులో సంచలన తీర్పు

మా సినిమాల మీద మీ పెత్తనం ఏంటి ??

బంగారు ఆభరణాలకు మెరుగుపెడతామంటూ వచ్చి.. చివరికి

రాబోయే పదేళ్లలో ఉద్యోగాల స్వరూపంలో రానున్న పెను మార్పులు