అద్భుతం.. రామాలయంలో హనుమంతుడు ప్రత్యక్షం

Updated on: Mar 31, 2026 | 4:17 PM

తెలంగాణలోని కొమురంభీం జిల్లా రామాలయంలో అద్భుతం జరిగింది. హనుమాన్ మాలధారులు పూజలు చేస్తుండగా, ఒక వానరం అక్కడకు వచ్చి భక్తితో పూజలో పాల్గొని, తీర్థప్రసాదాలు స్వీకరించింది. హనుమంతుడే వానర రూపంలో వచ్చాడని భక్తులు భావిస్తున్నారు. సాధారణంగా అల్లరి చేసే కోతి ఇంత క్రమశిక్షణతో ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దైవం పట్ల మానవులకే కాదు పశుపక్ష్యాదులు కూడా అపారమైన భక్తిని కలిగి ఉంటాయి. అందుకు ఎన్నో ఉదాహరణలు మనం పురాణ కథనాల్లో చూశాం. ఆ పురాణ కథనాలను నిజం చేస్తూ పశుపక్ష్యాదులు తమ భక్తిని చాటుకున్న అనేక ఘటనలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. తాజాగా తెలంగాణలోని కొమురంభీం జిల్లాల్లో అలాంటి అద్భుత ఘటన ఒకటి జరిగింది. రామాలయంలో కొందరు హనుమాన్ మాలధారులు పూజలు చేస్తుండగా వానరం ఒకటి అక్కడకు చేరి స్వామివారి పూజను ఎంతో భక్తితో తిలకించి, తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్లింది. సాక్షాత్తూ ఆ ఆంజనేయుడే వానర రూపంలో వచ్చాడా అన్నట్లుగా ఆ కోతి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానిక రామాలయంలో హనుమాన్ స్వాములు స్వామివారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భజనలు, మంత్రోచ్ఛారణలతో ఆలయం మారుమోగుతుండగా, ఎక్కడి నుంచో వచ్చిన ఒక వానరం నేరుగా గర్భాలయం వద్దకు చేరుకుంది. భక్తులెవరూ ఊహించని విధంగా, ఆ వానరం భయం లేకుండా స్వాములతో కలిసి పూజలో పాల్గొంది. అర్చకులు హారతి ఇస్తుండగా భక్తితో హారతి తీసుకోవడమే కాకుండా, తీర్థ ప్రసాదాలను కూడా స్వీకరించి అక్కడి నుంచి పరుగు తీసింది. సాధారణంగా వానరాలు కనిపిస్తే ఆహారం కోసం అల్లరి చేయడం చూస్తుంటాం. కానీ, ఇక్కడ వానరం చూపిన క్రమశిక్షణ, భక్తి చూసి భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. “హనుమంతుడే స్వయంగా వానర రూపంలో వచ్చి మాకు దర్శనమిచ్చాడు” అంటూ భక్తులు పులకించిపోయారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ధర ఎంతంటే ??

షాకింగ్‌ న్యూస్‌.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ దుకాణాలు బంద్‌

Follow Us