Viral: ఇండిగో ఫ్లైట్లో మరో ఘటన.. విమానంలో పక్కనే కూర్చున్న మహిళతో..!

|

Sep 14, 2023 | 9:21 AM

విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనకు సంబంధించిన ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. ముఖ్యంగా మహిళల పట్ల కొందరు తోటి ప్రయాణికులు వ్యవహరిస్తున్న తీరు శ్రుతి మించుతోంది. తాజాగా ముంబై నుంచి గౌహతి వెళ్తున్న ఇండిగో ఫ్లైట్లో ఇలాంటి ఘటనే జరిగింది. ఇండిగో సంస్థకు చెందిన ఫ్లైట్ ముంబై నుంచి గౌహతికి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఓ మహిళా ప్రయాణికురాలు..

విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనకు సంబంధించిన ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. ముఖ్యంగా మహిళల పట్ల కొందరు తోటి ప్రయాణికులు వ్యవహరిస్తున్న తీరు శ్రుతి మించుతోంది. తాజాగా ముంబై నుంచి గౌహతి వెళ్తున్న ఇండిగో ఫ్లైట్లో ఇలాంటి ఘటనే జరిగింది. ఇండిగో సంస్థకు చెందిన ఫ్లైట్ ముంబై నుంచి గౌహతికి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఓ మహిళా ప్రయాణికురాలు లైట్స్‌ ఆఫ్‌ చేసి నిద్రపోయింది. అదే అదునుగా పక్క సీట్లో కూర్చున్న ఓ కేటుగాడు సదరు మహిళా ప్యాసింజర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. నిద్రపోతున్న ఆమెపై చేతులు వేసి అసభ్యకరంగా తాకాడు. తొలుత అనుకోకుండా చేయి తగిలి ఉంటుందని భావించిన ఆమె.. ఆ తర్వాత కూడా అతను అలాగే ప్రవర్తించడంతో గట్టిగా గట్టిగా అరుస్తూ లైట్స్‌ ఆన్‌ చేసింది. అనంతరం ఆ వ్యక్తిపై అక్కడున్న సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఫ్లైట్ గౌహతి ఎయిర్పోర్టుకు చేరుకున్న వెంటనే ఎయిర్ లైన్స్ సిబ్బంది సదరు వ్యక్తిని భద్రతా సిబ్బందికి అప్పగించారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. గత రెండు నెలల వ్యవధిలో ఇండిగో విమానంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇది నాల్గోసారి కావడం గమనార్హం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..