నో ఫోటో షూట్‌, నో హగ్స్‌.. పెళ్లికొడుకు పది డిమాండ్లు ఇవే

Updated on: Nov 08, 2025 | 11:09 AM

లక్షలకు, లక్షలకు కుమ్మరించి, హంగూ ఆర్భాటాలతో నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లు, ఖరీదైన దుస్తులు, డైమండ్‌ నగలు, ఖరీదైన రిసార్ట్‌లు, పెళ్లి పందిట్లో స్క్రీన్లు,డ్రోన్‌ కెమెరాలు, ఇక భోజనాల సంగతి సరేసరి . ఇంత తతంగం లేనిది ఏ మధ్య తరగతి ఇంట్లో పెళ్లి జరగడంలేదు. తాజాగా ఒక పెళ్లి కొడుకు 10 డిమాండ్లపై నెట్టింట అంతా చర్చించుకుంటున్నారు.

మన దేశంలో కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరం. ఇప్పటి తరం లో కొంత మార్పు వచ్చినప్పటికీ గిప్ట్‌లు, కానుకలు పేరుతో తెరవెనుక, ఒప్పందాలు, భారీ ఎత్తు లావాదేవీలు జరిగిపోతూనే ఉంటాయి. అబ్బాయి తరపు కుటుంబం గొంతెమ్మ కోర్కెలు తీర్చేందుకు అమ్మాయి తరపు కుటుంబాలు శక్తికి మించి ఖర్చు చేస్తాయి, తమ కుమార్తె సంతోషంగా ఉంటుంది కదా అని అప్పు చేయడానికైనా వెనుకాడరు. ‍కానీ ఒక వరుడు మాత్రం కట్నం వద్దు కానీ 10 డిమాండ్లు నెరవేర్చండి చాలు అంటూ ఓ జాబితా సోషల్‌మీడియాలో పంచుకున్నాడు. ప్రీ-వెడ్డింగ్ షూట్ ఉండకూడదు, వధువు లెహంగాకు బదులు చీర ధరించాలి, దండలు మార్చుకునే సమయంలో తామిద్దరమే ఉండాలి, ఆ సమయంలో వధూవరులను ఎవరూ పైకి ఎత్తకూడదు, డీజే మ్యూజిక్‌ స్థానంలో వాయిద్య సంగీతం ఉండాలి, పెళ్లి తంతులో వీడియోగ్రాఫర్లు జోక్యం చేసుకోకూడదు, పూజారిని ఎవరూ అడ్డుకోకూడదు. ఫోటోగ్రాఫర్లు అడిగారని వధూవరులు పోజులు ఇవ్వకూడదు, వివాహం పగటిపూట జరగాలి. సాయంత్రానికి విధాయి అంటే వధువును అత్తారింటికి సాగనంపే వేడుక జరగాలి. తద్వారా అర్థరాత్రి వరకూ కార్యక్రమాలు ‘అతిథులకు అసౌకర్యం’ లాంటివి ఉండవు. పెళ్లి తరువాత వధూవరులను హగ్‌లు, కిస్‌లు ఇచ్చుకోవాలని ఎవరూ అడగకూడదు, పెళ్లి అనేది అగ్ని సాక్షిగా జరిగే పవిత్ర వేడుక, సినిమా షూటింగ్‌ కాదు అంటూ తన డిమాండ్లను వినిపించాడు. కట్నం తీసుకోవడం చట్ట విరుద్ధం.. అదేదో నువ్వు గొప్పవ్యక్తిలా ఫోజులిస్తున్నావంటూ ఒక నెటిజన్‌ విమర్శించారు. వివాహంలో సరదాగా గడపాలని అందరూ కోరుకుంటారు బ్రో అని మరొకరు, పెళ్లి కూతురు ఎలాంటి దుస్తులు ధరించాలో, పెళ్లి కొడుకు ఎందుకు డిసైడ్‌ చేయాలి అని ఇంకొందరు విమర్శించారు. “ఇలాంటి చిన్న చిన్న అసౌకర్యాకే అసహనానికి లోనైతే అతను పెళ్లి చేసుకునే అమ్మాయి జీవితాన్ని కంట్రోల్‌లో పెడతాడని మరొక యూజర్ రాసుకొచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాన్‌కార్డ్‌ హోల్డర్స్‌కి కేంద్రం హెచ్చరిక

గుడికి వెళుతుండగా చైన్‌ స్నాచింగ్‌ సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌

భయం భయంగా తిరుమలకు శ్రీవారి భక్తులు

కార్తీక పౌర్ణమి సందర్భంగా శివయ్యకు ఓ భక్తురాలి నివేదన.. ఏం చేసిందంటే

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. ఇక అధిక బిల్లుల బాధే ఉండదు