రిపేర్‌ చేసేలోపే పేలిన ఫోన్‌ !! చివరికి ఏమైందంటే ?? వీడియో వైరల్‌

Updated on: Nov 02, 2022 | 9:27 AM

ఒక మొబైల్‌ ఫోన్‌ రిపేర్‌ చేస్తుండగా ఒక్కసారిగా పేలింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ లలిత్‌పూర్‌లోని పాలీలో జరిగింది. ఒక కస్టమర్‌ తన ఫోన్‌ని మొబైల్‌ఫోన్లు రిపైర్‌ చేసే షాపుకి తీసుకువచ్చాడు.

ఒక మొబైల్‌ ఫోన్‌ రిపేర్‌ చేస్తుండగా ఒక్కసారిగా పేలింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ లలిత్‌పూర్‌లోని పాలీలో జరిగింది. ఒక కస్టమర్‌ తన ఫోన్‌ని మొబైల్‌ఫోన్లు రిపైర్‌ చేసే షాపుకి తీసుకువచ్చాడు. ఫోన్‌లో ఛార్జింగ్‌ సమస్య ఉందని షాపు యజమానికి చెప్పాడు. దీంతో సదరు షాపు యజమాని మొబైల్‌ ఫోన్‌ ఓపెన్‌ చేసి బ్యాటరీ తీసేందుకు యత్నిస్తున్నాడు. అంతే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. అదృష్టవశాత్తు త్రుటిలో సదరు షాపు యజమాని, కస్టమర్‌ ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. అందుకు సంబంధించిన ఘటన మొత్తం షాపు వద్ద ఉన్న సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ వీడియోలో… ఒక వ్యక్తి షాపు కౌంటర్‌ ముందు నిలబడి గ్లాస్‌ బల్లపై తన మొబైల్‌ని పెట్టాడు. మరోవ్యక్తి ఒక టూల్‌ ఉపయోగించి బ్యాటరీ తీసేందుకు యత్నించాడు. ఒక్కసారిగా ఫోన్‌ పేలి పొగలు వ్యాపించాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహిళను అమాంతం మింగేసిన కొండచిలువ !! పొట్ట చీల్చి..

రిషి కుటుంబానికి గోల్డెన్‌ డేస్‌.. భార్య అక్షతా మూర్తికి బంపరాఫర్‌ !!

Published on: Nov 02, 2022 09:27 AM
Follow Us