వరల్డ్‌ బ్యూటీస్‌ రాకతో మరింత అందంగా చార్మినార్‌ వీడియో

Updated on: May 15, 2025 | 6:07 PM

హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని లాడ్ బజార్ మంగళవారం మరింత అందంగా కనిపించింది. దీనికి కారణం ఇక్కడికి విశ్వ సుందరి మణులు సందర్శించడమే. తెలంగాణలో ప్రధాన టూరిజం స్పాట్స్ ను చూపిస్తున్న 109 దేశాల అందగత్తలు చారిత్రక ప్రదేశం చార్మినార్ లో సందర్శించారు.

లాడ్ బజార్ దగ్గర జరిగే హెరిటేజ్ వాక్ లో పాల్గొని నిజాం సంప్రదాయ వస్త్రధారణలో అలరించారు వరల్డ్ బ్యూటీస్. ఆనంతరం నిజాం రాజులు వాడిన వస్తువుల ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆ తర్వాత లాడ్ బజార్ లో షాపింగ్ చేశారు. ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే చార్మినార్ పరిసరాలు ప్రపంచ అందగత్తలు రావడంతో మరింత కొత్త శోభను సంతరించుకున్నాయి. చార్మినార్ అనగానే ప్రసిద్ధి కట్టడమే కాదు అక్కడి మార్కెట్లో దొరికే గాజులు ముత్యాలు కూడా గుర్తుకు వస్తాయి. మగువల మణుల దోచే బ్యాంగిల్స్ కి పెట్టింది పేరు లాడ్ బజార్. ఇప్పుడు ప్రపంచ దేశాల సుందరి మణులు ఇక్కడి గాజులపై ఆసక్తి చూపడంపై స్థానిక వ్యాపారులకు కూడా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. సుందరి మణుల కోసం రకరకాల డిజైన్లలో బ్యాంగిల్స్ ను తయారు చేశారు. బ్యాంగిల్ స్టోర్ నిర్వాహకులు మూడు రంగుల జెండాతో జత చేసి బ్యాంగిల్స్ ను తయారు చేశారు. ప్రత్యేక హ్యాండ్ మేడ్ గాజులు వరల్డ్ బ్యూటీస్ ను ఆకట్టుకుంటున్నాయి.