రైలు మెట్లపై నిల్చొని యువతుల ప్రయాణం.. షాకింగ్ వీడియో వైరల్
ముంబై లోకల్ రైళ్ళలో లక్షలాది మంది ప్రతిరోజూ తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. అయితే రైళ్ళ కొరత, ఆలస్యాల కారణంగా కొన్ని అవాంఛిత ఘటనలు అక్కడక్కడా జరుగుతుంటాయి. ఓ ముంబై లోకల్ రైల్లో తాజాగా అలాంటి ఘటన వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసి జనాలు గగ్గోలు పడుతున్నారు. ముంబైలోని ఓ లేడీస్ స్పెషల్ లోకల్ రైల్లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. కళ్యాణ్ నుంచి బయలుదేరిన ఓ రైలు ఏకంగా 40 నిమిషాలు ఆలస్యమైంది. దాంతో ప్లాట్ ఫామ్ పై జనాలు భారీ స్థాయిలో గుమిగూడారు. రైల్లోకి పోటీపడి ఎక్కేశారు. కొందరు చోటు దొరక్క బోగీ మెట్లపై నిలబడి ఇనుప కడ్డీలను పట్టుకొని ప్రమాదకరంగా జర్నీ చేశారు. మరికొందరు వారిని వారించారు. రైలు వేగంగా ప్రయాణిస్తుండటంతో చుట్టుపక్కల వారు ఏమి చేయలేకపోయారు
ఇలా ప్రమాదకర జర్నీ చేసిన యువతులను ఇదేమన్నా బస్సు అనుకున్నారా అంటూ ప్రయాణికులు మందలించారు. రైల్వే అధికారుల తీరును కూడా కొందరు తప్పుబట్టారు. రైలు ఆలస్యం కావడంతోనే విధిలేక యువతులు ఇలాంటి జర్నీలు చేయాల్సి వస్తోందని అన్నారు. వీడియోను కొందరు రైలు సేవకు ట్యాగ్ చేశారు. ఈ అంశంపై దృష్టి సారించాలని అన్నారు. దీనికి స్పందించిన రైలు సేవ విషయానికి సంబంధించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొంది. మరికొందరు సెంట్రల్ రైల్వే పోలీసులను కూడా ట్యాగ్ చేశారు. ఈ విషయంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఆఫీసుకు వెళ్ళేవారు కాస్త అంత ముందుగా ఇంటి నుంచి బయలుదేరాలన్న విషయాన్ని మరచిపోకూడదు. దీంతో ఇలాంటి ప్రమాదకర ప్రయాణాల అవసరం ఉండదు. బతుకు తెరువు కోసం వాళ్లు ఈ కష్టాలు పడుతున్నారు. కానీ ఇలాంటి తప్పిదాలు శాశ్వత వైకల్యానికి దారితీస్తాయని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఇలాంటి ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయని మరొకరు విచారం వ్యక్తం చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఘటన తెగ ట్రెండ్ అవుతోంది.

దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు

ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.

ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది

మీ ఇంటిలోకి పాములు వస్తాయని భయపడుతున్నారా? ఈ మొక్కలు నాటి చూడండి!

అద్దెకు పెళ్లి కుమార్తె.. ఇదో వింత మోసం..వీడియో

మేకప్ ప్రొడక్ట్స్తో బీ అలర్ట్..పాపం ఆ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్..

'పెళ్లి ఓ టైం వేస్ట్!' నాగరికతకు దూరంగా గుహలో నివాసం..
