పేపరేస్తే తప్పేంటి..? బుడ్డోడి కాన్ఫిడెన్స్‌కి కేటీఆర్ ఫిదా! వీడియో
ఓ పిల్లవాడి సెల్ఫ్ కాన్ఫిడెంట్‌కు ఫిదా అయ్యారు తెలంగాణ మంత్రి కేటీఆర్. చదువుకుంటూ న్యూస్ పేపర్ వేస్తున్న శ్రీ ప్రకాశ్ అనే పిల్లవాడిని ఓ వ్యక్తి పలరించాడు.
ఓ పిల్లవాడి సెల్ఫ్ కాన్ఫిడెంట్‌కు ఫిదా అయ్యారు తెలంగాణ మంత్రి కేటీఆర్. చదువుకుంటూ న్యూస్ పేపర్ వేస్తున్న శ్రీ ప్రకాశ్ అనే పిల్లవాడిని ఓ వ్యక్తి పలరించాడు. చదువుకోవాల్సిన వయసులో పేపర్ ఎందుకు వేస్తున్నావ్? అని అడిగగా.. అందుకు ఆ బుడ్డోడు.. ఏం పేపర్ వేయకూడదా? అదేమైనా తప్పా? చదువుకుంటూనే పనిచేస్తున్నా. దాంట్లో తప్పేముంది? అంటూ ఆ వ్యక్తికి సమాధానమిచ్చాడు. ఇందుకు సంబంధించని వీడియోను ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక ఆ బుడ్డోడి మాటలకు మంత్రి కేటీఆర్ కూడా ఫిదా అయ్యారు. అతడి ఆత్మవిశ్వాస స్థాయులు అమోఘమని కొనియాడారు. ఆలోచనల్లో స్పష్టత, హావభావాలు అన్నీ సూపర్ అన్నారు. చదువుకుంటూ పనిచేయడంలో తప్పేముందన్న అతడి క్లారిటీ చూస్తే ముచ్చటేస్తోందని మెచ్చుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Planes-Collide : గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. వీడియో