ఇద్దరు భార్యలు.. నేపాల్‌లో హోటల్.. ఇండియాలో ఆస్తులు.. కట్‌చేస్తే..

|

Aug 19, 2023 | 1:38 PM

మనోడు మామూలోడు కాదు.. నేపాల్‌లో హోటల్.. ఇద్దరు భార్యలు.. వారిలో ఒకరు ఇండియాలో, మరొకరు నేపాల్ లో ఉంటారు. అతను అఫీషల్‌గా ఇంటికి వస్తుంటాడు.. పోతుంటాడు. ఇండియాలో చాలా చోట్ల అతనికి ఆస్తులు ఉన్నాయి. పిల్లలు కూడా మంచి మంచి స్కూళ్లల్లో చదువుతున్నారు.. కానీ, ఏ ఒక్క భార్యకు కూడా అతను ఏం చేస్తాడో తెలీదు. అయితే, అతను చేసే ఉద్యోగం ఏంటో తెటుసా.. దొంగతనం. అవును, దొంగలకు దొంగ అయిన ఈ హైఫ్రొపైల్ థీఫ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

మనోడు మామూలోడు కాదు.. నేపాల్‌లో హోటల్.. ఇద్దరు భార్యలు.. వారిలో ఒకరు ఇండియాలో, మరొకరు నేపాల్ లో ఉంటారు. అతను అఫీషల్‌గా ఇంటికి వస్తుంటాడు.. పోతుంటాడు. ఇండియాలో చాలా చోట్ల అతనికి ఆస్తులు ఉన్నాయి. పిల్లలు కూడా మంచి మంచి స్కూళ్లల్లో చదువుతున్నారు.. కానీ, ఏ ఒక్క భార్యకు కూడా అతను ఏం చేస్తాడో తెలీదు. అయితే, అతను చేసే ఉద్యోగం ఏంటో తెటుసా.. దొంగతనం. అవును, దొంగలకు దొంగ అయిన ఈ హైఫ్రొపైల్ థీఫ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కట్ చేస్తే.. విచారణలో అతను చెప్పిన విషయాలు విని, ఢిల్లీ పోలీసులే ఆశ్చర్యపోయారు. పోలీసుల వివరాలు ప్రకారం.. ఈ ప్రొఫెషనల్‌ దొంగ పేరు మనోజ్‌ చౌబే. ఇతను ఉత్తరప్రదేశ్‌లోని సిద్దార్థ్‌ నగర్‌కి చెందినవాడుగా గుర్తించారు పోలీసులు. ఇతనికి నేపాల్‌లో ఒక హోటల్‌కూడా ఉంది. అంతేకాదు దేశవ్యాప్తంగా అనేకచోట్ల ఇతనికి ఆస్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు 200కి పైగా దొంగతనాలు చేశానని పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. అతనిపై దేశవ్యాప్తంగా దాదాపు 500 వరకూ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఇతను కేవలం దొంగతనాల కోసం ఢిల్లీకి వస్తుంటాడని, పోష్‌ ఏరియాల్లోని ఇళ్లే ఇతని టార్గెట్‌ అని పోలీసులు తెలిపారు. ఇతను మొదటిసారి 1997లో ఢిల్లీలోని ఓ క్యాంటీన్‌లో చోరీ చేసి పట్టుబడ్డాడని తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోతులన్నీ కలిస్తే… చిరుతైనా సరే.. తోక ముడవాల్సిందే

టీ కొట్టు నడుపుతూ కూతుర్ని క్రికెటర్‌‌ని చేశాడు !! నిరు పేద కుటుంబంలో పుట్టిన ఆణిముత్యం

TOP 9 ET News: మెగా మనసు..10కోట్లు వెనక్కి ఇచ్చిన చిరు | హాలీవుడ్ వర్షన్‌లో సలార్ ఇక బొమ్మ బద్దలే

Sai Dharam Tej: నీహారిక పై పిచ్చి కామెంట్.. వార్నింగ్ ఇచ్చిన తేజ్‌

Shankar: తమిళ డైరెక్టర్ల పార్టీలో చెర్రీ.. ఏదో పెద్దగానే జరగబోతోంది !!